ETV Bharat Telangana

తెలంగాణ

telangana

ETV Bharat / sports

భారత్-న్యూజిలాండ్: రాహుల్-అయ్యర్ 100 పరుగులు - భారత్ న్యూజిలాండ్

నామమాత్ర మూడో వన్డేలో నిలకడగా ఆడిన రాహుల్-అయ్యర్.. నాలుగో వికెట్​కు 100 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఆనంతరం 62 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద శ్రేయస్ ఔటయ్యాడు.

భారత్-న్యూజిలాండ్: రాహుల్-అయ్యర్ 100 పరుగులు
శ్రేయస్ అయ్యర్
author img

By

Published : Feb 11, 2020, 9:49 AM IST

Updated : Feb 29, 2020, 11:03 PM IST

మౌంట్ మాంగనూయ్ వేదికగా న్యూజిలాండ్​తో జరుగుతున్న మూడో వన్డేలో భారత్ నిలకడగా ఆడుతోంది. టాస్ ఓడి బ్యాటింగ్​కు దిగిన కోహ్లీసేన.. ప్రారంభంలోనే ఓపెనర్ మయాంక్ అగర్వాల్(1), కెప్టెన్ కోహ్లీ(9) వికెట్లు కోల్పోయింది. కుదురుకుంటున్న మరో ఓపెనర్ పృథ్వీషా(40).. అనవసర పరుగుకు ప్రయత్నించి రనౌటయ్యాడు.

ఆ తర్వాత క్రీజులోకి వచ్చిన శ్రేయస్, రాహుల్ జోడీ నిలకడగా ఆడారు. నాలుగో వికెట్​కు 100 పరుగులకు పైగా భాగస్వామ్యం నెలకొల్పారు. ఆ వెంటనే 62 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద శ్రేయస్.. నీషమ్ బౌలింగ్​లో పెవిలియన్ బాట పట్టాడు.

Last Updated : Feb 29, 2020, 11:03 PM IST

ABOUT THE AUTHOR

author-img

...view details