న్యూజిలాండ్ గడ్డపై అడుగుపెట్టిన భారత్.. ఆరంభ మ్యాచ్‌లోనే అదరహో అనిపించింది. రెండొందల స్కోరును అలవోకగా ఛేదించి ఔరా అనిపించింది. స్వదేశంలో సాగించిన దూకుడును విదేశీ గడ్డపైనా చూపిస్తూ ఐదు టీ20ల సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. నేడు రెండో టీ20 సందర్భంగా కివీస్‌తో మరోమారు సమరానికి సై అంటోంది మెన్ ఇన్ బ్లూ. ఈ మ్యాచ్‌లోనూ గెలిచి సిరీస్‌లో మరింత ఆధిక్యం సాధించాలని టీమిండియా భావిస్తుండగా.. తొలి టీ20 ఓటమికి ప్రతీకారం తీర్చుకోవాలని న్యూజిలాండ్ పట్టుదలగా ఉంది. ఇరుజట్లు ఎలాంటి ప్రణాళికలతో ముందుకొచ్చే అవకాశముందో ఒకసారి పరిశీలిస్తే..
బలంగా టాప్ ఆర్డర్...
టీమిండియా బ్యాట్స్‌మెన్ అంతా మంచి ఫామ్‌లో ఉన్నారు. రోహిత్ తొలి మ్యాచ్‌లో విఫలమైనా పెద్దగా చింతించాల్సిన పనిలేదు. మరోవైపు కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ, శ్రేయస్ అయ్యర్, మనీశ్ పాండే బ్యాట్ ఝుళిపించడానికి సిద్ధంగా ఉన్నారు. తొలి మ్యాచ్‌లో క్లిష్ట పరిస్థితుల్లో బ్యాటింగ్ చేయడానికి వచ్చిన శ్రేయస్ అయ్యర్ (58) ఒత్తిడిని జయించి అద్భుతంగా ఆడాడు. అయ్యర్ గత సెప్టెంబర్ నుంచి మొత్తం 12 టీ20లు ఆడగా 34.14 సగటుతో రెండు అర్ధ శతకాలు సాధించాడు. ఫలితంగా టాప్-5 బ్యాట్స్‌మెన్‌తో టాప్ ఆర్డర్ బలంగా ఉంది. ఈ నేపథ్యంలో తుది జట్టులో మార్పులు చేసే అవకాశం లేదు.
సైనీ తుది జట్టులోకి ఖాయమా..?
సాధారణంగా టీమిండియా విన్నింగ్ కాంబినేషన్‌ను ఎప్పుడూ మార్చదు. అయితే తొలి టీ20లో జస్ప్రీత్ బుమ్రా(4 ఓవర్లలో 31 పరుగులు) ఒక్కడే చాలా పొదుపుగా బౌలింగ్ చేశాడు. షమీ(4 ఓవర్లలో 53), శార్దూల్ ఠాకూర్(3 ఓవర్లలో 44)ను కివీస్ ఆటగాళ్లు దంచికొట్టారు. అయితే యార్కర్లు వేయగలిగే సత్తా ఉన్న నవ్‌దీప్ సైనీని ఠాకూర్ స్థానంలో ఈ మ్యాచ్‌కు తీసుకునే అవకాశం ఉంది. జడేజాతో పాటు చాహల్/కుల్దీప్లలో ఒకరు, ఆల్‌రౌండర్‌గా శివమ్ దూబె రంగంలోకి దిగనున్నారు.
కివీస్ మార్పులకు నో..!