హామిల్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో భారత జట్టు ఆకట్టుకుంటోంది. ఓపెనర్లుగా బరిలోకి దిగిన మయాంక్ అగర్వాల్ 32(31 బంతుల్లో; 6 ఫోర్లు), పృథ్వీ షా 20(21 బంతుల్లో; 3 ఫోర్లు) శుభారంభాలను భారీ స్కోర్లుగా మలచలేకపోయారు. ధాటిగా ఆడిన వీరిద్దరూ 4 పరుగుల వ్యవధిలోనే ఔటయ్యారు. గ్రాండ్‌హోమ్ బౌలింగ్‌లో పృథ్వీ ఔటవ్వగా... మయాంక్ సౌథీ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు.
నిలకడగా భారత బ్యాటింగ్.. క్రీజులో శ్రేయస్, రాహుల్ - కష్టాల్లో భారత్.. 156 రన్స్‌కే 3 వికెట్లు
హామిల్టన్ వేదికగా న్యూజిలాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో భారత్ రాణిస్తోంది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన టీమిండియా.. 54 పరుగులకే ఓపెనర్లు మయాంక్ అగర్వాల్, పృథ్వీషా వికెట్లు కోల్పోయింది. ఆ తర్వాత కెప్టెన్ విరాట్ కోహ్లీ అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. శ్రేయస్ నిలకడగా బ్యాటింగ్ కొనసాగిస్తున్నాడు.

భారత్X న్యూజిలాండ్: కష్టాల్లో భారత్.. 156 రన్స్‌కే 3 వికెట్లు
ఆ తర్వాత వచ్చిన కోహ్లీ, శ్రేయస్ ఇన్నింగ్స్‌ను నడిపించారు. విరాట్ కెరీర్లో మరో అర్ధశతకం ఖాతాలో వేసుకున్నాడు. కోహ్లీ 51 పరుగులు చేసి వెనుదిరిగాడు. శ్రేయస్ అయ్యర్(49*), కేఎల్ రాహుల్(7) క్రీజులో ఉన్నారు. 32 ఓవర్లకు భారత జట్టు స్కోరు- 172/3
Last Updated : Feb 29, 2020, 6:05 AM IST