భారత్‌లో కరోనా విజృంభిస్తోన్న నేపథ్యంలో ఐపీఎల్ 13వ సీజన్‌ను ఎక్కడ, ఎప్పుడు నిర్వహిస్తే సజావుగా సాగుతుందనే అంశంపై పరిశీలిస్తూనే ఉంది బీసీసీఐ. అయితే ఈ టోర్నీకి ఆతిథ్యమిచ్చేందుకు ఇప్పటికే శ్రీలంక, యూఏఈ దేశాలు ముందుకొచ్చాయి. తాజాగా ఈ రేసులోకి న్యూజిలాండ్ వచ్చింది. తమ దేశంలో లీగ్‌ను నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపింది.
ఆటగాళ్ల సురక్షితమే ప్రాధాన్యత
న్యూజిలాండ్ ఆతిథ్యం ప్రతిపాదనపై ఓ బీసీసీఐ అధికారి స్పందించారు. భారత్‌లో కరోనా వల్ల టోర్నీ నిర్వహించడం సాధ్యంకాకపోతేనే విదేశీ గడ్డపై నిర్వహించేందుకు ప్రత్యామ్నయం చూస్తామని తెలిపారు. ఎక్కడ నిర్వహించిన ఆటగాళ్ల భద్రతే తమ తొలి ప్రాధాన్యతమని అన్నారు.
"స్వదేశంలోనే ఐపీఎల్ నిర్వహించాలనేది మా తొలి ప్రాధాన్యం. ఒకవేళ కుదరకపోతే ప్రత్యామ్నయంగా విదేశీ గడ్డపై ఎక్కడ నిర్వహించాలనేది బీసీసీఐ కమిటీ నిర్ణయిస్తుంది. ఇప్పటికే యూఏఈ, శ్రీలంక, న్యూజిలాండ్ దేశాలు ఆతిథ్యమివ్వడానికి ముందుకొచ్చాయి. కానీ ఎక్కడ నిర్వహించినా ఆటగాళ్ల భద్రతే మా తొలి ప్రాథాన్యత. దీనిపై రాజీపడేది లేదు"
-బీసీసీఐ అధికారి