తెలంగాణ

telangana

ETV Bharat / sports

సిరీస్ గెలిచి జోరుమీదున్న కివీస్​కు ఐసీసీ షాక్ - స్లో ఓవర్ రేట్ కారణంగా కివీస్​కు జరిమాన

ఆక్లాండ్ వేదికగా జరిగిన మ్యాచ్​లో న్యూజిలాండ్ విజయం సాధించింది. అయితే టీమిండియాపై గెలిచి ఉత్సాహం మీదున్న కివీస్​కు షాక్ ఇచ్చింది ఐసీసీ. స్లో ఓవర్​ రేట్ కారణంగా ఆటగాళ్ల ఫీజులో కోత విధించింది.

కివీస్
కివీస్

By

Published : Feb 8, 2020, 9:29 PM IST

Updated : Feb 29, 2020, 4:34 PM IST

ఆక్లాండ్ వేదికగా టీమిండియాతో జరిగిన తొలి వన్డేలో విజయం సాధించింది న్యూజిలాండ్. వరుసగా రెండు మ్యాచ్​లు గెలిచి 2-0 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. ఈ గెలుపు ఉత్సాహంలో ఉన్న కివీస్​కు షాక్ తగిలింది. ఈ మ్యాచ్​లో స్లో ఓవర్​ రేట్ కారణంగా లాథమ్ సేనకు భారీ జరిమానా విధించింది అంతర్జాతీయ క్రికెట్ మండలి. ఆటగాళ్ల ఫీజులో 60 శాతం కోత విధిస్తున్నట్లు ప్రకటించింది.

"న్యూజిలాండ్ జట్టు నిర్దేశిత సమయంలో 50 ఓవర్లు వేయాల్సి ఉండగా మూడు ఓవర్లు ఆలస్యంగా వేసింది. అందుకే ఆటగాళ్ల మ్యాచ్​ ఫీజులో 60 శాతం కోత విధిస్తున్నాం. ఈ మ్యాచ్​కు సారథిగా ఉన్న టామ్ లాథమ్ తన పొరపాటును అంగీకరించడం వల్ల ఎలాంటి విచారణ ఉండదు"
-ఐసీసీ ప్రకటన

ఈ సిరీస్​లో కివీస్​కు ఇదే మొదటి జరిమాన. స్లో ఓవర్ రేట్ కారణంగా ఇప్పటికే నాలుగు, ఐదు టీ20లతో పాటు మొదటి వన్డేలో జరిమానాకు గురైంది టీమిండియా.

Last Updated : Feb 29, 2020, 4:34 PM IST

ABOUT THE AUTHOR

...view details