తెలంగాణ

telangana

ETV Bharat / sports

'వారిని తక్కువ అంచనా వేయలేం' - న్యూజిలాండ్

ప్రపంచకప్​లో వరుస ఓటముల్ని ఎదుర్కొన్న దక్షిణాఫ్రికాను తక్కువ అంచనా వేయలేమని న్యూజిలాండ్ పేసర్ బౌల్ట్ అంటున్నాడు. నేడు బర్మింగ్​హామ్ వేదికగా ఈ రెండు జట్లు హోరాహోరీగా తలపడనున్నాయి.

'వారిని తక్కువ అంచనా వేయలేం'

By

Published : Jun 19, 2019, 10:20 AM IST

ప్రపంచకప్​లో విజయాల కోసం శ్రమిస్తున్న దక్షిణాఫ్రికాను తక్కువ అంచనా వేయలేమని అంటున్నాడు న్యూజిలాండ్​ పేసర్ ట్రెంట్ బౌల్ట్. ఈ రెండు జట్లు నేడు బర్మింగ్​హామ్ వేదికగా తలపడనున్నాయి.

"మేం సఫారీలతో తలపడేందుకు సిద్ధంగా ఉన్నాం. వారికిది తప్పక గెలవాల్సిన మ్యాచ్​. దక్షిణాఫ్రికా అత్యుత్తమంగా ఆడొచ్చు. ఈ రెండు జట్ల మధ్య పోటీ అంటే ఆసక్తికరమే. ఈ మ్యాచ్​లో మా బౌలింగ్​తో ప్రత్యర్థిపై ఒత్తిడి తెచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. 2015 ప్రపంచకప్​లో​​ న్యూజిలాండ్-దక్షిణాఫ్రికా మ్యాచ్​.. కివీస్​ తలపడ్డ వాటిలో అత్యుత్తమం." -ట్రెంట్ బౌల్ట్, కివీస్ పేసర్

న్యూజిలాండ్ పేసర్ ట్రెంట్ బౌల్ట్

ఈ మ్యాచ్​లో కివీస్​ గెలిస్తే పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంటుంది. దక్షిణాఫ్రికా ఓడితే ఆ జట్టుకు సెమీస్ అవకాశాలు మరింత సంక్లిష్టమవుతాయి.

ఇది చదవండి: కివీస్​పై సఫారీలు ప్రతీకారం తీర్చుకుంటారా..!

ABOUT THE AUTHOR

...view details