తెలంగాణ

telangana

ETV Bharat / sports

మైదానంలో న్యూజిలాండ్​ క్రికెటర్ల ప్రాక్టీస్​ షురూ

కరోనా కారణంగా సుమారు 6 నెలలకు పైగా నిలిచిపోయిన క్రికెట్ కార్యకలాపాలు మెల్లమెల్లగా ప్రారంభమవుతున్నాయి. ఈ క్రమంలోనే సోమవారం న్యూజిలాండ్​ ఆటగాళ్లు శిక్షణ మొదలుపెట్టారు. క్రికెటర్ల ప్రాక్టీస్​ కోసం ఆరు జాతీయ శిబిరాలను నిర్వహించనున్నట్లు న్యూజిలాండ్​ క్రికెట్ బోర్డు తెలిపింది.

New Zealand cricketers start squad training at High Performance Centre in Lincoln | Cricket News - Times of India
న్యూజిలాండ్​ క్రికెటర్లు

By

Published : Jul 13, 2020, 5:01 PM IST

Updated : Jul 13, 2020, 5:25 PM IST

కరోనా కారణంగా లభించిన సుదీర్ఘ విరామం అనంతరం.. న్యూజిలాండ్​ క్రికెటర్లు శిక్షణ ప్రారంభించారు. ఈ విషయాన్ని న్యూజిలాండ్​ క్రికెట్​ బోర్డు వెల్లడించింది. ఈ క్రమంలోనే సెప్టెంబరు వరకు ఆరు జాతీయ శిక్షణా శిబిరాలను నిర్వహించనున్నట్లు ప్రకటించింది.

సోమవారం శిక్షణ పొందిన పురుషుల ఆటగాళ్లలో టామ్ లాథమ్​, హెన్రీ నికోలస్​, మాట్​ హెన్రీ, డారిల్​ మిచెల్​ ఉన్నారు. కెప్టెన్​ కేన్​ విలియమ్సన్​ వచ్చే వారం మౌంట్​ మంగనూయ్​లో ప్రాక్టీస్​ ప్రారంభించనున్నాడు.

సౌత్​ ఐలాండ్​, వెల్లింగ్టన్​కు చెందిన బ్లాక్​ క్యాప్స్​, వైట్​ ఫ్రెన్స్​ జట్లకు ఈ వారం కాంటర్బరీ హబ్​లో శిక్షణ ఇవ్వనున్నట్లు ఎన్​జెడ్​సీ వెల్లడించింది. అనంతరం జులై 19 నుంచి మౌంట్​ మంగనూయ్​లోని బే ఓవల్​ వద్ద ఆటగాళ్ల శిక్షణ కోసం రెండో శిబిరం ఏర్పాటు చేసినట్లు వివరించింది.

లింకన్​లో ఏర్పాటు చేసిన తొలి క్యాంప్​ జులై 16 నాటికి ముగియనుంది. ఆ తర్వాత క్యాంప్​ను ఆగస్టు(10నుంచి13) వరకు నిర్వహించనున్నారు. సెంప్టబరు శిక్షణా శిబిరాలకు సంబంధించి ఇంకా తేదీ నిర్ణయించలేదు.

న్యూజిలాండ్​ శిక్షణా శిబిరాల షెడ్యూల్

లింకన్​:

క్యాంప్​1: జులై 13-16

క్యాంప్​2: ఆగస్టు 10-13

క్యాంప్​3: సెప్టెంబరు(ఇంకా తేదీ ప్రకటించలేదు)

మౌంట్​ మౌంగనూయ్

క్యాంప్​1: జులై19-24

క్యాంప్​2: ఆగస్టు 16-21

క్యాంప్​3:సెప్టెంబరు 6-11

ఇదీ చూడండి:'బ్రాడ్​ను​ వదిలేయడమే ఇంగ్లాండ్​ చేసిన తప్పు'

Last Updated : Jul 13, 2020, 5:25 PM IST

ABOUT THE AUTHOR

...view details