తెలంగాణ

telangana

ETV Bharat / sports

టెస్టు సిరీస్​ క్లీన్​స్వీప్​.. ర్యాంకింగ్స్​లో కివీస్​దే అగ్రస్థానం - New Zealand vs pakisthan

రెండో టెస్టులోనూ గెలిచిన కివీస్.. ఐసీసీ ర్యాంకింగ్స్​లో అగ్రస్థానానికి చేరుకుంది. ఈ ఘనత సాధించడం ఆ జట్టుకిదే తొలిసారి కావడం విశేషం.

New Zealand become number one team for the first time in history
పాక్​పై న్యూజిలాండ్ గెలుపు.. ర్యాంకింగ్స్​లో సరికొత్త రికార్డు

By

Published : Jan 6, 2021, 10:33 AM IST

ఐసీసీ టెస్టు ర్యాంకింగ్స్​లో న్యూజిలాండ్ జట్టు చరిత్ర సృష్టించింది. పాకిస్థాన్​తో జరిగిన రెండో టెస్టులో 176 పరుగుల తేడాతో విజయం సాధించి, ఐసీసీ జట్టు ర్యాంకింగ్స్​లో తొలి స్థానానికి ఎగబాకింది. ​విలియమ్సన్(238) ద్విశతకంతో ఆకట్టుకునే ప్రదర్శన చేయగా.. జెమీసన్ తన అద్భుతమైన బౌలింగ్​తో రెండు ఇన్నింగ్స్​ల్లో 11 వికెట్లు పడగొట్టాడు. ఫలితంగా రెండు మ్యాచ్​ల టెస్టు సిరీస్​ను 2-0 తేడాతో కివీస్ క్లీన్​స్వీప్ చేసింది.

ఐసీసీ ర్యాంకింగ్స్​
న్యూజిలాండ్ టెస్టు జట్టు

తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 297 పరుగులకు ఆలౌటైంది. అనంతరం న్యూజిలాండ్ జట్టులో​ కెప్టెన్ విలియమ్సన్(238), హెన్రీ నికోలస్(157), డారీ మిచెల్(102) అసాధారణమైన బ్యాటింగ్​తో జట్టుకు స్కోరుబోర్డును పరుగులు పెట్టించారు. దీంతో 659 పరుగుల వద్ద తొలి ఇన్నింగ్స్​ విలియమ్సన్​ సేన డిక్లేర్డ్​ చేసింది. ఆ తర్వాత బ్యాటింగ్​కు దిగిన పాకిస్థాన్.. 186 పరుగులకే ఆలౌటైంది. దీంతో కివీస్ ఇన్నింగ్స్​ తేడాతో గెలిచింది.

ఇది చదవండి:రెండో టెస్టులో కరోనా.. మూడో మ్యాచ్​లో మాస్క్​ తప్పనిసరి

ABOUT THE AUTHOR

...view details