భారత బ్యాట్స్మెన్ విఫలమైన వేళ.. రెండో టెస్టులో విజయం దిశగా సాగుతోంది న్యూజిలాండ్. మరో 86 పరుగులు చేస్తే మ్యాచ్ గెలిచి సిరీస్ కైవసం చేసుకోనుంది. 132 పరుగుల లక్ష్యఛేదనలో లంచ్ సమయానికి వికెట్ కోల్పోకుండా 46 పరుగులు చేసింది విలియమ్సన్ సేన. బ్లండెల్(23), లాథమ్(16) పరుగులతో క్రీజులో ఉన్నారు.
విజయానికి 86 పరుగుల దూరంలో కివీస్ - లంచ్
భారత్తో రెండో టెస్టులో విజయం దిశగా పయనిస్తోంది న్యూజిలాండ్. 132 పరుగుల లక్ష్యఛేదనలో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన కివీస్ లంచ్ సమయానికి వికెట్ కోల్పోకుండా 46 పరుగులు చేసింది.
విజయానికి 86 పరుగుల దూరంలో కివీస్
అంతకుముందు రెండో ఇన్నింగ్స్లో భారత్ 124 పరుగులకే ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్ ఆధిక్యం కలుపుకొని న్యూజిలాండ్ ముందు 132 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఉంచింది. పుజారా(24) టాప్ స్కోరర్. ఇన్నింగ్స్లో రెండో అత్యధిక స్కోరు ఎక్స్ట్రా(21)లదే కావడం గమనార్హం. జడేజా(16), కోహ్లీ(14), పృథ్వీ షా(14) మినహా మరెవరూ రెండంకెల స్కోరు చేయలేకపోయారు.
కివీస్ బౌలర్లలో బౌల్ట్ 4, సౌథీ 3 వికెట్లతో చెలరేగారు.
Last Updated : Mar 3, 2020, 3:00 AM IST