తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఫైనల్​ ఆడకుండానే న్యూసౌత్​వేల్స్​ జట్టు విజేత - దేశవాళీ క్రికెట్​ షెఫీల్డ్​ ఫీల్డ్​ టోర్నీలో న్యూసౌత్​వేల్స్​ అగ్రస్థానం

ఆస్ట్రేలియాలో జరిగే దేశవాళీ క్రికెట్​ షెఫీల్డ్​ ఫీల్డ్​ టోర్నీలో న్యూసౌత్​వేల్స్​ జట్టు విజేతగా నిలిచింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో టోర్నీలో ఫైనల్​ ఆడించకుండానే ఛాంపియన్​ను ప్రకటించింది క్రికెట్​ ఆస్ట్రేలియా. ఇప్పటివరకు జరిగిన లీగ్​ మ్యాచ్​ల్లో న్యూసౌత్​వేల్స్​ అగ్రస్థానంలో ఉండటం వల్ల ఈ నిర్ణయం తీసుకుంది.

New South Wales Win Sheffield Shield Title After Final Gets Cancelled
ఫైనల్​ ఆడకుండానే న్యూసౌత్​వేల్స్​ జట్టు విజేత

By

Published : Mar 17, 2020, 1:18 PM IST

ఆస్ట్రేలియాలో నిర్వహించే దేశవాళీ క్రికెట్‌ షెఫీల్డ్‌ ఫీల్డ్‌ టోర్నీలో న్యూ సౌత్‌వేల్స్‌ జట్టు ఆరేళ్ల తర్వాత ఛాంపియన్‌గా నిలిచింది. కరోనా (కొవిడ్‌ 19) వైరస్‌ విజృంభిస్తున్న నేపథ్యంలో ఆ టోర్నీని ఫైనల్‌ రౌండ్‌ ఆడించకుండానే నిలిపివేశారు. అయితే ఇప్పటివరకు జరిగిన లీగ్‌ మ్యాచ్‌ల్లో న్యూ సౌత్‌వేల్స్‌ అగ్రస్థానంలో నిలిచింది. విక్టోరియా రెండో స్థానంలో ఉంది. తదుపరి మ్యాచ్‌లను నిర్వహించే పరిస్థితి లేకపోవడం వల్ల క్రికెట్‌ ఆస్ట్రేలియా న్యూసౌత్‌వేల్స్‌ను విజేతగా మంగళవారం ప్రకటించింది.

మరోవైపు కరోనాను కట్టడి చేసే నేపథ్యంలో ఆరోగ్యసంస్థల సూచనల మేరకు తమ కార్యాలయాలను మూసివేసింది సీఏ.

"కరోనా నివారణ కోసం ప్రభుత్వం, వైద్యాధికారుల సూచనల మేరకు మేం చేయాల్సిందంతా చేస్తున్నాం. అలాగే మా కార్యాలయాలను మూసేసి సిబ్బందిని ఇంటి నుంచే పనిచేయమన్నాం"

-క్రికెట్‌ ఆస్ట్రేలియా

ఈ ప్రమాదకర వైరస్‌ సోమవారం నాటికి ప్రపంచ వ్యాప్తంగా 1,80,000 మందికి సోకింది. సుమారు 7000 మందికిపైగా మృతిచెందారు. దీంతో పలు దేశాలు పూర్తి నిర్బంధంలో ఉన్నాయి.

ఇదీ చూడండి : ఐపీఎల్​లో ఆసీస్ క్రికెటర్లు ఆడేది అనుమానమే!

ABOUT THE AUTHOR

...view details