కొత్త ఆటగాళ్లతో తమ జట్టుకు అనుభవం వస్తుందని దిల్లీ క్యాపిటల్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ అన్నాడు. ఇటీవలే జరిగిన మినీ వేలంలో తమ జట్టులో స్టీవ్ స్మిత్, టామ్ కరన్‌తో పాటు కొందరు స్వదేశీ ఆటగాళ్లు చేరడంపై ఈ విధంగా స్పందించాడు.
"దిల్లీ జట్టులో కొత్తగా చేరిన సీనియర్ ఆటగాళ్ల అనుభవం జట్టు సభ్యులకు చాలా ఉపయోగపడుతుంది. స్టీవ్ స్మిత్, టామ్ కరన్ వంటి విదేశీ ఆటగాళ్లతో పాటు కొందరు స్వదేశీ ఆటగాళ్లు జట్టులో చేరారు. దేశవాళీ క్రికెట్లో లుక్మాన్ మెరివాలా అద్భుతంగా రాణించాడు. ఇతను జట్టులో చేరడం ఇతర యువ ఆటగాళ్లకు స్పూర్తిదాయకం."