తెలంగాణ

telangana

ETV Bharat / sports

లంక ప్రీమియర్‌ లీగ్‌ 'థీమ్​సాంగ్'​ వచ్చేసిందోచ్​.. - Lanka Premier League theme song news

ఐపీఎల్​ తర్వాత మరో లీగ్​ క్రికెట్​ ప్రియులను అలరించేందుకు సిద్ధమౌతోంది. శ్రీలంక వేదికగా నవంబర్​ 26 నుంచి లంక ప్రీమియర్‌ లీగ్‌(ఎల్‌పీఎల్‌) ప్రారంభం కానుంది. తాజాగా ఈ టోర్నీ థీమ్​సాంగ్​ను విడుదలైంది.

lpl 2020 news
దుమ్ములేపుతున్న లంక ప్రీమియర్‌ లీగ్‌ థీమ్​సాంగ్​

By

Published : Nov 20, 2020, 9:37 PM IST

క్రికెట్​ అభిమానులను అలరించేందుకు లంక ప్రీమియర్​ లీగ్​ సిద్ధమవుతోంది. నవంబర్​ 26 నుంచి ప్రారంభంకానున్న ఈ టోర్నీ థీమ్​సాంగ్​ను తాజాగా విడుదల చేశారు నిర్వాహకులు. ఇది ఉర్రూతలూగించేలా ఉండి నెటిజన్లను ఆకట్టుకుంటోంది.

ఈ ఏడాది టోర్నీలో భారత ఆటగాళ్లు సైతం సందడి చేయనున్నారు. మునాఫ్​ పటేల్​, ఇర్ఫాన్​ పఠాన్​, మన్​ప్రీత్​ గోనీ, సందీప్​ త్యాగి, మన్వీందర్​ సింగ్​ ఈ లీగ్​లో బరిలోకి దిగనున్నారు. స్టార్​ క్రికెటర్లు క్రిస్​గేల్​, లసిత్​ మలింగ మాత్రం ఈ సీజన్​కు దూరమయ్యారు.

కొలొంబో, కండ్యా, గాలె, దంబుల్లా, జఫ్నా అయిదు ఫ్రాంఛైస్‌ జట్లు ఈ ఎల్‌పీఎల్‌-టీ20లో తలపడనున్నాయి. కొలొంబో, కండ్యా జట్ల మధ్య మొదటి మ్యాచ్.. హంబంటోటాలోని మహేంద్ర రాజపక్సే అంతర్జాతీయ క్రికెట్‌ స్టేడియంలో నవంబర్‌ 26న జరగనుంది. డిసెంబర్‌ 13, 14న సెమీ ఫైనల్స్‌‌, 16న ఫైనల్‌ మ్యాచ్‌ ఉంటుంది.

ABOUT THE AUTHOR

...view details