అంతర్జాతీయ క్రికెట్ మండలి(ఐసీసీ) అధ్యక్ష పదవికి త్వరలోనే ఎన్నిక జరగనుంది. బాధ్యతలు చేపట్టాలనుకున్న వారు అక్టోబరు 18 లోగా తమ నామినేషన్లు దాఖలు చేసుకోవాలని ఐసీసీ డైరెక్టర్ల బోర్డు ప్రకటించింది. ఐసీసీ ఛైర్మన్గా ప్రస్తుతం శశాంక్ మనోహర్ ఉన్నారు. త్వరలోనే ఆయన పదవీ కాలం ముగియనుండటం వల్ల ఐసీసీ ఈ ఎన్నిక ప్రకటన జారీ చేసింది.
ఐసీసీ ఛైర్మన్ పదవికి దరఖాస్తుల ఆహ్వానం - ఐసీసీ ఛైర్మన్ వార్తలు
ఐసీసీ అధ్యక్షుడు శశాంక్ మనోహర్ పదవీకాలం త్వరలోనే ముగియనుండటం వల్ల ఆ పదవికి ఎన్నిక జరపాలని ఐసీసీ డైరెక్టర్స్ బోర్డు నిర్ణయించింది. ఆసక్తిగా ఉన్న వాళ్లు అక్టోబరు 18లోగా వారి నామినేషన్లను దాఖలు చేయాలని ప్రకటన విడుదల చేసింది.

ఐసీసీ ఛైర్మన్ పదవికి దరఖాస్తుల ఆహ్వానం
ఐసీసీ ఆడిట్ కమిటీ స్వతంత్ర ఛైర్మన్ ఈ ప్రక్రియను పర్యవేక్షిస్తారు. అయితే దీనికి సంబంధించిన గ్లోబల్ బాడీ ఓటింగ్ విధానాన్ని తెలియజేయలేదు. ఎన్నికయ్యే కొత్త ఛైర్మన్ డిసెంబరు నుంచి బాధ్యతలు చేపడతారని ఐసీసీ స్పష్టం చేసింది.
ఐసీసీ రాజ్యాంగం ప్రకారం అధ్యక్ష పదవికి నామినేషన్ దాఖలు చేయాలంటే అంతర్జాతీయ క్రికెట్ మండలిలో డైరెక్టర్గా పనిచేస్తున్న లేదా పనిచేసిన అనుభవం కచ్చితంగా ఉండాలని ఐసీసీ డైరెక్టర్ల బోర్డు విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.