తెలంగాణ

telangana

కోహ్లీ కెప్టెన్​ కావడంలో ధోనీదే కీలకపాత్ర

By

Published : May 31, 2020, 7:06 AM IST

Updated : May 31, 2020, 9:08 AM IST

తానేమి సులభంగా భారత జట్టుకు కెప్టెన్ అయిపోలేదని, తను ఈ బాధ్యతలు అందుకోవడంలో ధోనీ కీలక పాత్ర పోషించాడని విరాట్ కోహ్లీ చెప్పాడు.

కోహ్లీ కెప్టెన్​ కావడంలో ధోనీదే కీలకపాత్ర
కోహ్లీ ధోనీ

తాను భారత క్రికెట్‌ జట్టుకు కెప్టెన్‌ కావడం రాత్రికి రాత్రి జరగలేదని చెప్పాడు విరాట్‌ కోహ్లీ. ఆ ప్రక్రియ ఆరేడేళ్ల పాటు సాగిందని, అందులో మాజీ కెప్టెన్‌ ధోనీ కీలకంగా వ్యవహరించాడని అతనన్నాడు.

తను కెప్టెన్సీ అందుకోవడంలో ధోనీది కీలకపాత్ర అని చెప్పిన కోహ్లీ

"నేను కెప్టెన్‌ కావడంలో కీలక పాత్ర ధోనీదే. ఉన్నట్లుండి అతను సెలక్టర్ల వద్దకెళ్లి ఇతను తర్వాతి కెప్టెన్‌ అంటూ నా పేరు చెప్పడం లాంటిదేమీ జరగలేదు. నన్ను చాలా కాలం పరిశీలించాడు. ఇతను బాధ్యత తీసుకుంటాడా లేదా అని చూసి, తర్వాత ఏం చేయాలో నేర్పిస్తూ కెప్టెన్సీ బదిలీ ప్రక్రియను నెమ్మదిగా కానిచ్చారు. ఆరేడేళ్ల పాటు నమ్మకాన్ని చూరగొన్నాక జరిగిందిది. నేనెప్పుడూ ధోనీ పక్కనే ఉంటూ ఆయా సందర్భాల్లో ఏం చేయొచ్చో చెప్పేవాణ్ని. అభిప్రాయాలడిగేవాణ్ని. చాలా ఆలోచనల్ని అతను వ్యతిరేకించేవాడు. అలాగే ఎన్నో విషయాలు నాతో చర్చించేవాడు. చివరికి తన తర్వాత నేను బాధ్యత తీసుకోగలనని అతడికి నమ్మకం కలిగింది" అని స్పిన్నర్‌ అశ్విన్‌తో కలిసి పాల్గొన్న ఇన్‌స్టా చర్చలో కోహ్లీ వెల్లడించాడు.

టీమ్​ఇండియా కెప్టెన్సీ గురించి చెప్పిన విరాట్ కోహ్లీ

తన భార్య అనుష్క శర్మ గురించి మాట్లాడుతూ.. "ఆమెకు దేనిపైన అయినా నమ్మకం కుదిరితే ఏమాత్రం భయం లేకుండా ముందుకెళ్లిపోతుంది. మనుషుల్ని చాలా బాగా అర్థం చేసుకుంటుంది. కొన్నిసార్లు నేను ఏం మాట్లాడకున్నా.. నా శరీర భాషను బట్టి నా మనసు తెలుసుకుంటుంది. మా ఇద్దరి ఆలోచనలు ఒకే రకంగా ఉండటం ఇందుకు దోహదపడుతుంది" అని కోహ్లీ చెప్పాడు. తనకు గ్రహాంతర వాసులకు సంబంధించిన అంశాలంటే అమితమైన ఆసక్తి అని, ఎగిరే పళ్లేలు (యుఎఫ్‌ఓ)ను చూడాలన్నది తన లక్ష్యమని విరాట్‌ ఈ సందర్భంగా చెప్పాడు.

Last Updated : May 31, 2020, 9:08 AM IST

ABOUT THE AUTHOR

...view details