తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ధోని ఆ బంతిని మిస్ చేస్తాడనుకోలేదు'

రాయల్ ఛాలెంజర్స్​తో జరిగిన మ్యాచ్​లో చెన్నై గెలుపు ముంగిట ఓడిపోయింది. చివరి ఓవర్లో ఆఖరి బంతి వరకు సాగిన ఉత్కంఠ మ్యాచ్​లో బెంగళూరు విజయం సాధించింది. ధోని ఆటతీరుపై స్పందించాడు పార్థివ్ పటేల్.

By

Published : Apr 22, 2019, 12:57 PM IST

పార్థివ్ పటేల్

చిన్నస్వామి స్టేడియంలో ధోని విశ్వరూపాన్ని బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ అంత తొందరగా మర్చిపోలేదు. 5 బంతుల్లో 25 పరుగులతో సంచలన ఇన్నింగ్స్ ఆడి చెన్నైను గెలుపు అంచుల వరకు తీసుకెళ్లాడు. దీనిపై రాయల్ ఛాలెంజర్స్ కీపర్ పార్థివ్ పటేల్ స్పందించాడు. చివరి బంతిని ధోని మిస్ చేస్తాడనుకోలేదని తెలిపాడు.

"ఆఖరి బంతికి ధోనీని పరుగులు చేయకుండా కట్టడి చేయాలని అనుకున్నాం. చివరి బంతిని ఆఫ్ సైడ్ వేయాలని నిర్ణయించాం. ఒక వేళ బంతిని లెగ్ సైడ్ వేస్తే రెండు పరుగులు తేలికగా వచ్చేవి. అందుకు అనుగుణంగానే ఉమేష్ యాదవ్ ఆఫ్ సైడ్ స్లో డెలివరీ వేశాడు. కానీ ఆ బాల్ ధోని నుంచి మిస్సవ్వడం ఆశ్చర్యాన్ని కలిగించింది".
పార్థివ్ పటేల్, బెంగళూరు ఆటగాడు

బెంగళూరు, ముంబయిల్లో ఆడుతున్నపుడు చివరి 5 ఓవర్లలో 70 పరుగులు సాధించడం పెద్ద కష్టమేమీ కాదని అన్నాడు పటేల్. 80-90 పరుగులు ఉంటే మాత్రం గెలుపు అవకాశాలు ఉంటాయని తెలిపాడు. ధోని క్రీజులో ఉంటే చివరి ఓవర్లలో ఆట ఎలా ఉంటుందో అందరికీ తెలుసనీ.. అందుకే వీలైనన్ని డాట్ బాల్స్ వేయడానికి ప్రయత్నించామని వ్యాఖ్యానించాడు.

ఈ మ్యాచ్​లో మొదట బ్యాటింగ్ చేసిన బెంగళూరు జట్టు 161 పరుగులు చేసింది. ఓపెనర్​గా వచ్చిన పార్థివ్ అర్ధశతకంతో ఆకట్టుకున్నాడు. చివరి బంతికి అద్భుత రనౌట్ చేసి జట్టుకు విజయాన్నిందించాడు.

ఇవీ చూడండి.. ధోనిని చూసి కోహ్లీ ఎందుకు భయపడ్డాడో తెలుసా?

ABOUT THE AUTHOR

...view details