సామాజిక మాధ్యమాల్లో ఏదైనా పోస్టు పెట్టేప్పుడు ఆలోచించాలి. లేదంటే కామెంట్స్, ట్రోల్స్‌తో టైమ్‌లైన్ నిండిపోవడం ఖాయం. ఇపుడు ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటున్నాడు పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షోయబ్ మాలిక్. భారత క్రికెట్ అభిమానులు ప్రస్తుతం ట్రోల్స్తోమాలిక్ను ఓ ఆట ఆడేసుకుంటున్నారు.
అసలేం జరిగింది
2012 డిసెంబర్ 25న టీమిండియాపై పాకిస్థాన్ విజయం సాధించింది. ఆ ఫొటోను మాలిక్ పోస్ట్ చేస్తూ.. "స్నేహితులకు క్రిస్మస్ శుభాకాంక్షలు" అని ట్వీట్ చేశాడు. అందులో మాలిక్ విజయానందంలో ఉండగా ధోనీ అతడి పక్కనే ఉన్నాడు. ఈ ట్వీట్‌పై ఆగ్రహించిన ధోనీ అభిమానులు.. మాలిక్‌ను ట్రోల్ చేయడం ఆరంభించారు. అతడు డకౌట్‌గా వెనుదిరగడం, పాక్‌పై 2007 టీ20 ప్రపంచకప్ గెలవడం, క్లీన్‌బౌల్డ్ అవ్వడం, ధోనీ చేతిలో స్టంపౌటయ్యే ఫొటోలను అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
2012లో పాక్‌తో జరిగిన రెండు టీ20ల సిరీస్‌ను భారత్ 1-1తో సమం చేసింది. డిసెంబర్ 25న జరిగిన తొలి టీ20లో టీమిండియా ఐదు వికెట్ల తేడాతో ఓడిపోయింది. రెండో టీ20లో భారత్ చెలరేగి ఆడి, పాక్‌పై 11 పరుగుల తేడాతో విజయం సాధించింది.
ఇవీ చూడండి.. గంగూలీ, ద్రవిడ్ మధ్య సుదీర్ఘ చర్చ.. బుమ్రా కోసమేనా!