ఆస్ట్రేలియాలో వచ్చే ఏడాది జరగనున్న టీ20 ప్రపంచకప్‌లో మరో కొత్త జట్టు కనువిందు చేయనుంది. ఈ టోర్నీలో పాల్గొనెేందుకు నెదర్లాండ్స్ అర్హత సాధించింది. టీ20 ప్రపంచకప్ క్వాలిఫయర్ మ్యాచ్‌లో... యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ)పై ఎనిమిది వికెట్ల తేడాతో గెలిచింది. ఫలితంగా ప్రపంచకప్‌కు బెర్త్ దక్కించుకుంది డచ్ టీమ్.
తొలుత బ్యాటింగ్ చేసిన యూఏఈ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 80 పరుగులే చేసింది. నెదర్లాండ్స్ బౌలర్ల ధాటికి తొమ్మిది పరుగులకే సగం వికెట్లు కోల్పోయింది. ఆ సమయంలో అహ్మద్ (22), వాహబ్ (19) ఫర్వాలేదనిపించడం వల్ల యూఏఈ ఆ మాత్రం స్కోరైనా చేయగలిగింది. నెదర్లాండ్స్ బౌలర్లలో గ్లోవర్ నాలుగు వికెట్లతో సత్తా చాటాడు.