తెలంగాణ

telangana

ETV Bharat / sports

టీ20ల్లో రికార్డు.. పరుగులేమి ఇవ్వకుండా 6 వికెట్లు - anjali chanda 6 wickets

దక్షిణాసియా క్రీడల్లో బాగంగా మాల్దీవులు జట్టుతో జరిగిన టీ20 మ్యాచ్​లో నేపాల్ బౌలర్ అంజలి చండా అత్యుత్తమ ప్రదర్శన చేసింది. పరుగులేమి ఇవ్వకుండా 6 వికెట్లు తీసి చరిత్ర సృష్టించింది.

Nepal's Anjali Chand takes 6/0, best ever bowling figures in women's T20I
నేపాల్

By

Published : Dec 2, 2019, 6:23 PM IST

టీ20 క్రికెట్లో 3 వికెట్లు తీయడమే ఘనమనకుంటున్న ఈ రోజుల్లో ఆరు వికెట్లు తీస్తే మంచి ప్రదర్శన చేసినట్లే. అలాంటిది పరుగులేమి ఇవ్వకుండా ఈ ఘనత సాధిస్తే.. అద్బుతం.. కాదు అంతకు మించే అని చెప్పాలి. దక్షిణాసియా క్రీడల్లో భాగంగా మాల్దీవులుతో జరిగిన మహిళల టీ20లో నేపాల్ బౌలర్ అంజలి చండా(6/0).. ఈ రికార్డు సొంతం చేసుకుని చరిత్ర సృష్టించింది.

16 పరుగులకు ఆలౌట్​..

ఈ మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్ చేసిన మాల్దీవులు.. 10.1 ఓవర్లలో 16 పరుగులకు ఆలౌటైంది. అంజలి చండా ధాటికి మాల్దీవుల బ్యాట్స్ఉమెన్ పెవిలియన్​కు వరుసగా క్యూ కట్టారు. మరో బౌలర్ కరుణ భండారీ 4 పరుగులిచ్చి 2 వికెట్లు తీయగా.. మిగతా బ్యాట్స్​ఉమెన్ రనౌట్​గా వెనుదిరిగారు.

5 బంతుల్లోనే లక్ష్య ఛేదన

అనంతరం బరిలో దిగిన నేపాల్.. 5 బంతుల్లోనే లక్ష్యాన్ని పూర్తి చేసింది. ఓపెనర్ కాజల్ శ్రేష్ట 13 పరుగులతో నాటౌట్​గా నిలిచింది. మిగిలినవి అదనపు పరుగుల(2వైడ్లు, లెగ్ బై, నోబాల్) రూపంలో వచ్చాయి.

13 బంతుల్లో.. 6 వికెట్లు

2.1 ఓవర్లు బౌలింగ్ చేసిన అంజలి.. ఒక్క పరుగు ఇవ్వకపోవడం విశేషం. 6/0 ప్రదర్శనతో అంతర్జాతీయ క్రికెట్లో ఈ ఘనత సాధించి రికార్డు సృష్టించింది. అంతకు ముందు ఈ రికార్డు మలేషియాకు చెందిన మాస్ ఎలిసా(6/3) పేరిట ఉంది. ఈ ఏడాది జనవరిలో చైనాతో జరిగిన మ్యాచ్​లో ఎలిసా ఈ ఘనత అందుకుంది.

ఇదీ చదవండి: రెండో టెస్టులో పాక్​పై ఆసీస్​ గెలుపు.. సిరీస్ క్లీన్​స్వీప్​

ABOUT THE AUTHOR

...view details