తెలంగాణ

telangana

ETV Bharat / sports

ద్రవిడ్ పర్యవేక్షణలో కరోనా టాస్క్​ఫోర్స్ - latest cricket news

కరోనా వ్యాప్తి నేపథ్యంలో క్రీడాకారుల రక్షణార్థం ప్రత్యేక కొవిడ్​ టాస్క్​ఫోర్స్​ను ఏర్పాటు చేసింది బీసీసీఐ. ఇందులో ద్రవిడ్​నూ భాగం చేస్తున్నట్లు ప్రకటించింది.

ద్రవిడ్ పర్యవేక్షణలో కరోనా టాస్క్​ఫోర్స్
మాజీ క్రికెటర్ ద్రవిడ్

By

Published : Aug 4, 2020, 5:30 AM IST

Updated : Aug 4, 2020, 6:29 AM IST

కరోనా కారణంగా నెలల తరబడి నిలిచిపోయిన క్రికెట్​ కార్యకలాపాలు మెల్లగా ప్రారంభమవుతున్నాయి. ఈ క్రమంలోనే క్రీడాకారుల రక్షణ కోసం బీసీసీఐ కొవిడ్​-19 టాస్క్​ఫోర్స్​ను ఏర్పాటు చేసింది. ఇందులో నేషనల్​ అకాడమీ చీఫ్​ రాహుల్​ ద్రవిడ్​ కూడా ఉంటారని ఉన్నత కమిటీ.. రాష్ట్ర సంఘాలకు స్పష్టం చేసింది.

నిబంధనల ప్రకారం ఆటగాళ్లు శిబిరాల్లో శిక్షణ ప్రారంభించే ముందు.. అనుమతి పత్రం మీద సంతకం చేయాల్సి ఉంటుంది. 60 ఏళ్లు పైబడిన వారిని, వైద్య పరమైన సమస్యలున్న వ్యక్తులను శిబిరాల్లో ఉంచకుండా చర్యలు తీసుకోనున్నారు.

ఈ క్రమంలోనే బెంగళూరులోని ఎన్​సీఏలో క్రికెటర్లకు శిక్షణ ప్రారంభం కానుంది. ఆటగాళ్ల కోసం టాస్క్​ఫోర్స్​ ఏర్పాటు చేసిన బీసీసీఐ... ద్రవిడ్​తో పాటు వైద్యాధికారి, క్లీనింగ్​ ఆఫీసర్​, బీసీసీఐ ఏజీఎమ్​ తదితరులను భాగం చేసింది.

రెండేసి సార్లు పరీక్షలు..

శిక్షణ ప్రారంభించే ముందు ఆటగాళ్లు, సహాయక సిబ్బందికి రెండుసార్లు కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు.ఇందులో నెగిటివ్​గా తేలిన వారు మాత్రమే క్యాంప్​లో భాగం కానున్నారు. అంతేకాకుండా స్టేడియానికి వెళ్లే మార్గంలో క్రీడాకారులంతా ఎన్-95 మాస్కులు తప్పనిసరిగా ధరించాలి. బహిరంగ ప్రదేశాల్లో, శిక్షణ సమయంలో కళ్లజోడు పెట్టుకోవాలి. కరోనా నుంచి రక్షణ కోసం ఇలా క్రికెటర్లకు పలు మార్గదర్శకాలను సూచించింది బీసీసీఐ.

Last Updated : Aug 4, 2020, 6:29 AM IST

ABOUT THE AUTHOR

...view details