టీమ్ఇండియా స్టార్ ఆల్‌రౌండర్ దాదాపు మూడు నెలల తర్వాత స్వదేశానికి ఇటీవల తిరిగొచ్చాడు. యూఏఈలో ఐపీఎల్, ఆస్ట్రేలియా పర్యటనను విజయవంతంగా ముగించుకుని ఈ మధ్యే ఇంటికి చేరుకున్నాడు. ఈ సందర్భంగా కుమారుడు అగస్త్యకు పాలు పడుతున్న ఫొటోను పోస్ట్ చేశాడు. 'దేశ బాధ్యతల నుంచి తండ్రి బాధ్యతల్లోకి' అనే ఆసక్తికర క్యాప్షన్ జోడించాడు.
దేశ బాధ్యతల నుంచి తండ్రి డ్యూటీలోకి పాండ్య
దాదాపు మూడు నెలల తర్వాత ఇంటికొచ్చిన హార్దిక్ పాండ్య.. కొడుకు అగస్త్యతో సమయాన్ని ఆస్వాదిస్తున్నాడు. ఈ క్రమంలో చిన్నారికి పాలు పడుతున్న ఫొటోను ట్వీట్ చేశాడు.
దేశ బాధ్యతల నుంచి తండ్రి బాధ్యతల్లోకి పాండ్య
ఐపీఎల్ ఈ సీజన్లో ముంబయి ఇండియన్స్ తరఫున అదరిపోయే ఇన్నింగ్స్‌లు ఆడిన హార్దిక్ పాండ్య.. ఆ తర్వాత ఆస్ట్రేలియాలో పరిమిత ఓవర్ల సిరీస్‌లోనూ బ్యాటుతో ఆకట్టుకున్నాడు. అలానే తనకొచ్చిన ప్లేయర్ ఆఫ్ ది సిరీస్‌ను యువ బౌలర్ నటరాజన్‌కు ఇచ్చి, క్రికెట్ ప్రేమికుల హృదయాల్ని గెల్చుకున్నాడు.
Last Updated : Dec 12, 2020, 9:00 PM IST