తెలంగాణ

telangana

ETV Bharat / sports

లోదుస్తులపై ఆస్ట్రేలియా​ బౌలర్​ ఫొటో! - అండర్​వేర్​పై నాథన్​ లైయన్​

తన వింత చేష్టలతో అందర్ని ఆశ్చర్యానికి గురిచేశాడు ఆస్ట్రేలియా స్పిన్నర్​ నాథన్​​ లియోన్​. తన ఫొటోనే ముద్రించిన అండర్​వేర్​తో శుక్రవారం ప్రాక్టీసుకు వచ్చి తన సహచరులను నవ్వించాడు. ఆ ఫొటోలు ప్రస్తుతం నెట్టింట వైరల్​గా మారాయి.

Nathan Lyon wears an underwear featuring himself on the front
అండర్​వేర్​పై ఆస్ట్రేలియా​ బౌలర్​ ఫొటో!

By

Published : Jan 1, 2021, 6:13 PM IST

ఆస్ట్రేలియా స్పిన్నర్​ నాథన్​ లియోన్​​.. తన చేష్టలతో సహచరులతో పాటు నెటిజన్లను ఆశ్చర్యానికి గురిచేశాడు. తన ఫొటోనే ముద్రించిన లోదుస్తులను ధరించిన నాథన్​, శుక్రవారం ప్రాక్టీసుకు వచ్చాడు. ఆ ఫోటోలు నెటిజన్లతో నవ్వులు పూయిస్తూ.. వైరల్​గా మారాయి. వికెట్​ అప్పీల్ కోసం లియోన్​ ట్రేడ్​మార్క్​ ఫోజిచ్చిన ఫొటో ఆ అండర్​వేర్​పై ఉంది​.

అంతర్జాతీయ కెరీర్​లో ఇప్పటివరకు 98 మ్యాచ్​లు ఆడిన నాథన్​ లియోన్.. 394 వికెట్లు పడగొట్టాడు. ప్రస్తుతం టీమ్​ఇండియాతో జరుగుతోన్న టెస్టు సిరీస్​లో అద్భుతమైన బౌలింగ్​తో రాణిస్తున్నాడు.

ఇదీ చూడండి:హిట్​మ్యాన్ రోహిత్ శర్మకు వైస్ కెప్టెన్సీ

ABOUT THE AUTHOR

...view details