తెలంగాణ

telangana

ETV Bharat / sports

'అది క్రీడా స్ఫూర్తికి విరుద్ధమేం కాదు'

దక్షిణాఫ్రికాతో జరిగిన మూడో టీ20 మ్యాచ్​ సందర్భంగా ఇంగ్లాండ్‌ జట్టుకు రహస్య సందేశాలు పంపించాడు విశ్లేషకుడు నాథన్ లీమన్. ప్రస్తుతం ఇది చర్చనీయాంశంగా మారింది.

nathan lemon
'అది క్రీడా స్పూర్తికి విరుద్ధమేం కాదు'

By

Published : Dec 4, 2020, 6:49 AM IST

దక్షిణాఫ్రికాతో మూడో టీ20 మ్యాచ్‌ సందర్భంగా ఇంగ్లాండ్‌ డ్రెస్సింగ్‌ రూమ్‌ నుంచి మైదానంలోని కెప్టెన్‌కు రహస్య సందేశాలు పంపండం చర్చనీయాంశమవుతుంది. ఇంగ్లాండ్‌ విశ్లేషకుడు నాథన్‌ లీమన్‌ సీ3, 4ఇ అంటూ రాసిన సందేశాల్ని మైదానంలో ఆటగాళ్లకు కనిపించేలా బాల్కనీ రెయిలింగ్‌ దగ్గర ఉంచాడు. మైదానంలోని ఆటగాళ్లకు నాథన్‌ ఇలా సందేశాల్ని పంపడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

1999 ప్రపంచకప్‌ సందర్భంగా అప్పటి కోచ్‌ బాబ్‌ వూమర్‌.. దక్షిణాఫ్రికా కెప్టెన్‌ హాన్సీ క్రానె, పేసర్‌ అలన్‌ డొనాల్డ్‌తో ఇయర్‌ ఫోన్‌లో మాట్లాడటం తీవ్ర దుమారం రేపింది. దీంతో మైదానంలో ఎలక్ట్రానిక్‌ వస్తువుల వినియోగంపై ఐసీసీ వెంటనే నిషేధం విధించింది.

అయితే బాబ్‌ వూమర్‌ చర్యకు.. నాథన్‌ ఘటనకు చాలా తేడా ఉందని ఇంగ్లాండ్‌ అంటోంది. మ్యాచ్‌ రిఫరీకి సమాచారం ఇచ్చిన తర్వాతే తాము ఇలా చేశామని ఇంగ్లాండ్‌ పేసర్‌ మార్క్‌ వుడ్‌ తెలిపాడు. ఇంగ్లాండ్‌ కెప్టెన్‌ ఇయాన్‌ మోర్గాన్‌ కూడా లీమన్‌ చర్యలను సమర్థించాడు. అతడు క్రీడాస్ఫూర్తికి విరుద్ధంగా ఏం నడుచుకోలేదని అన్నాడు.

ఇదీ చదవండి:ప్రపంచంలో ఏ జట్టునైనా సరే ఓడిస్తాం: బెన్​స్టోక్స్​

ABOUT THE AUTHOR

...view details