ఐపీఎల్లో సత్తాచాటిన యువ బౌలర్ నటరాజన్ భారత జట్టులో చోటు సంపాదించాడు. తొలుత ఆస్ట్రేలియాతో పరిమిత ఓవర్ల సిరీస్‌లో ఆడిన నటరాజన్.. టెస్టు జట్టులో చోటు దక్కించుకున్నాడు. ప్రస్తుతం ఆసీస్‌తో జరగనున్న మూడో టెస్టు కోసం.. ఉమేష్ యాదవ్ స్థానంలో టీమ్ఇండియా స్క్వాడ్‌లో చేరాడు.
ప్రాక్టీస్ మ్యాచ్‌లో నటరాజన్ అద్భుత క్యాచ్ - నటరాజన్ క్యాచ్ షేర్ చేసిన భారత క్రికెట్ జట్టు
మెల్బోర్న్ క్రికెట్ మైదానంలో జరిగిన ప్రాక్టీస్ మ్యాచ్‌లో యువ బౌలర్ నటరాజన్ ఓ అద్భుత క్యాచ్ పట్టాడు. ఈ వీడియోను బీసీసీఐ తమ అధికారిక సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేసింది.
![ప్రాక్టీస్ మ్యాచ్‌లో నటరాజన్ అద్భుత క్యాచ్ Natarajan stunning catch](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10104805-thumbnail-3x2-natarajan.jpg)
ప్రాక్టీస్ మ్యాచ్‌లో నటరాజన్ అద్భుత క్యాచ్
మూడో టెస్టు కోసం జరిగిన ప్రాక్టీస్ సెషన్లో భాగంగా నటరాజన్ ఓ అద్భుత క్యాచ్ పట్టాడు. మెల్బోర్న్ క్రికెట్ మైదానంలో.. వెనక్కి పరుగెడుతూ పట్టిన ఈ క్యాచ్ అబ్బురపరిచేలా ఉంది. ఈ వీడియోను బీసీసీఐ సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేసింది.
ఇదీ చదవండి:సయ్యద్ ముస్తాక్ అలీ టోర్నీ: సై అంటున్న కుర్రాళ్లు