యువ బౌలర్ నటరాజన్.. టెస్టుల్లో భారత తుదిజట్టుకు ఎంపికవడంపై ఆసీస్ క్రికెటర్ వార్నర్ హర్షం వ్యక్తం చేశాడు. అయితే ఈ ఫార్మాట్లో స్థిరంగా లైన్, లెంగ్త్‌తో బౌలింగ్ చేస్తాడనే విషయాన్ని కచ్చితంగా చెప్పలేనని అన్నాడు. వీరిద్దరూ ఐపీఎల్లో సన్‌రైజర్స్ హైదరాబాద్ తరఫున ఆడుతున్నారు. టీ20ల్లో మ్యాజిక్‌ను నట్టు మళ్లీ రిపీట్ చేస్తాడా అన్న ప్రశ్నకు వార్నర్ ఈ విధంగా స్పందించాడు.
"అతడికి మంచి లైన్, లెంగ్త్ ఉన్నాయి. కానీ టెస్టుల్లో వరుస ఓవర్లలో బిగి కొనసాగిస్తాడని కచ్చితంగా చెప్పలేను. సిరాజ్ లాగే నట్టు కూడా తన అరంగేట్రాన్ని విజయవంతం చేసుకుంటాడని నమ్మతున్నా. బిడ్డ పుట్టినా వెళ్లకుండా నెట్ బౌలర్‌గా వచ్చి, తుది జట్టులో చోటు సంపాదించడం గొప్ప విషయం. అతడికి అభినందనలు. మంచి బౌలర్. అవకాశం వస్తే ఎలా సద్వినియోగం చేసుకోవాలో అతడికి బాగా తెలుసు" -డేవిడ్ వార్నర్, ఆస్ట్రేలియా బ్యాట్స్‌మన్