16 ఏళ్ల పాకిస్థాన్ బౌలింగ్ సంచలనం నసీమ్ షా అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టాడు. గురువారం ఆస్ట్రేలియాతో ఆరంభమైన తొలి టెస్టులో ఈ టీనేజ్ పేసర్ అరంగేట్రం చేశాడు.
"నసీమ్‌ను కచ్చితంగా ఆడిస్తాం. అతను గొప్పగా బౌలింగ్ చేస్తున్నాడు. పూర్తి ఫిట్‌గా ఉన్నాడు. టెస్టుల్లో రాణిస్తాడని నమ్ముతున్నా. ఇంత చిన్న వయసులోనే ఈ స్థాయికి చేరుకోవడం చాలా మందికి సాధ్యపడదు." -అజార్ అలీ, పాక్ టెస్టు కెప్టెన్