'మా అమ్మ చెప్పిన మాట వినాల్సింది' అని భారత క్రికెటర్ దినేశ్ కార్తిక్ వాపోయాడు. "నువ్వు ఫాస్ట్ బౌలర్‌వి కావాలని మా అమ్మ నాకు సూచిస్తూ ఉండేది. కానీ.. నేను మా నాన్న మాట విన్నాను. వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ అయ్యాను. మా ఇంట్లో అమ్మకు ముందు చూపు ఎక్కువ. ఆ విషయం నాకు ఇప్పుడు స్పష్టంగా అర్థమైంది" అని కార్తిక్ తెగ బాధపడుతున్నాడు.
సరే ఇదంతా ఇప్పుడెందుకు అనుకుంటున్నారా..? గురువారం ఐపీఎల్ 2021 వేలంపాట జరిగింది. అందులో ఫాస్ట్‌బౌలర్లకు భారీగా ధర పలికింది. క్రిస్ మోరిస్‌కు రూ.16.25 కోట్లు. కైల్ జెమీసన్‌కు రూ.15కోట్లు, రిచర్డ్‌సన్‌కు రూ.14కోట్లు దక్కాయి. ఈసారి వేలంలో ఫాస్ట్ బౌలర్లపై జట్టు యాజమాన్యాలు ఆసక్తి చూపించి ఎక్కువ పెట్టుబడి పెట్టాయి. అందుకే.. ఈ వేలంపాటను ఉద్దేశించి.. తాను వాళ్ల అమ్మ చెప్పినట్లుగా ఫాస్ట్‌బౌలర్ అయ్యుంటే తనకు కూడా భారీ ధర వచ్చేదని అర్థం వచ్చేలా ట్వీట్ చేశాడు.