వన్డేల్లో రీఎంట్రీ ఇస్తానని ఆశాభావం వ్యక్తం చేశాడు భారత క్రికెటర్ అజింక్యా రహానె. మూడు ఫార్మాట్లోనూ తన సత్తా నిరూపించుకోవడం కోసం మానసికంగా సన్నద్ధమవుతున్నట్లు తెలిపాడు.
"వన్డేల్లో ఓపెనింగ్ లేదా నెం.4 స్థానంలో ఆడటానికి సిద్ధంగా ఉన్నాను. ఈ ఫార్మాట్లోకి రీఎంట్రీ ఇస్తాననే పూర్తి విశ్వాసం ఉంది. కానీ అవకాశం ఎప్పుడు వస్తుందో తెలియదు. అన్ని ఫార్మాట్లలోనూ బాగా రాణించేందుకు మానసికంగా సిద్ధమవుతున్నాను. సానుకూల దృక్పథం, సామర్థ్యం మెరుగుపర్చుకోవడంతోనే మన గురించి మనకు తెలుస్తుంది"
-రహానె, భారత క్రికెటర్.