టీమ్ఇండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనా, అతడు 'పాజీ' అని అభిమానంగా పిలిచే దిగ్గజ సచిన్ తెందుల్కర్‌కు మధ్య మంచి సాన్నిహిత్యం ఉంది. సందర్భానుసారం మాస్టర్‌పై తన ప్రేమను చాటిచెప్పే రైనా.. ఇటీవల ఓ ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు. 100వ సెంచరీ చేసిన తర్వాత సచిన్ తనతో చెప్పిన మాటలను ఓ క్రీడా మ్యాగజైన్‌కు తెలిపాడు.
"పాజీ 100వ శతకం సాధించేటప్పుడు మరో ఎండ్‌లో నేను ఉన్నా. సింగిల్ తీసి సచిన్ సెంచరీ చేసిన తర్వాత ఆయనకు శుభాకాంక్షలు తెలిపాను. ఈ శతకం చాలా కాలంగా బాకీ ఉందని అన్నాను. అప్పుడు ఆయన.. 'ఈ క్షణం కోసం ఎదురుచూస్తూ నా జుట్టు నెరసిపోయింది' అని నాతో చెప్పారు"
- సురేశ్ రైనా, భారత మాజీ క్రికెటర్
ఆ క్షణంలో సచిన్ ఎంత మానసిక భారాన్ని మోస్తున్నారో అర్థమైందని రైనా అన్నాడు. మాస్టర్‌తో ఉన్న తీపి జ్ఞాపకాలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నాడు.