తెలంగాణ

telangana

ETV Bharat / sports

కష్టానికి తగిన ఫలితం దక్కింది: చాహర్ - Deepak Chaha Claiming Best-Ever T20I Figures

బంగ్లాదేశ్​తో జరిగిన ఆఖరి టీ20లో ఆరు వికెట్లు తీసి భారత్ విజయంలో కీలకపాత్ర పోషించాడు టీమిండియా బౌలర్ దీపక్ చాహర్. మ్యాచ్ అనంతరం మాట్లాడుతూ.. ఇలాంటి ప్రదర్శన చేస్తానని కలలో కూడా ఊహించలేదని అన్నాడు.

రాహుల్

By

Published : Nov 11, 2019, 10:54 AM IST

బంగ్లాదేశ్​తో జరిగిన చివరి టీ20లో గెలిచింది టీమిండియా. తద్వారా సిరీస్​నూ కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్​లో భారత యువ బౌలర్ దీపక్ చాహర్ ఆరు వికెట్లతో సత్తాచాటాడు. ఇందులో హ్యాట్రిక్ ఉండటం విశేషం. ఈ ప్రదర్శనపై సంతృప్తి వ్యక్తం చేశాడీ ఆటగాడు.

"కలలో కూడా ఇలాంటి ప్రదర్శన ఊహించలేదు. ఇలా బౌలింగ్‌ చేస్తానని ఎప్పుడూ అనుకోలేదు, చిన్నప్పటి నుంచి కష్టపడి ఆడేందుకు ప్రయత్నిస్తున్నా. నా కష్టానికి ప్రతిఫలం దక్కింది. కీలక ఓవర్లలో నాతో బౌలింగ్‌ చేయించాలని రోహిత్‌ భావించాడు. జట్టు యాజమాన్యం కూడా అదే అనుకుంది. నేనెప్పుడూ తర్వాత బంతి గురించే ఆలోచిస్తా. నా బౌలింగ్ కోటా పూర్తయ్యేవరకు అలాగే ఆలోచిస్తా’"
-దీపక్ చాహర్, టీమిండియా యువ బౌలర్

ఈ మ్యాచ్​లో చాహర్ 3.2 ఓవర్లు వేసి 7 పరుగులిచ్చి 6 వికెట్ల తీశాడు. ఆఖరి ఓవర్లలో హ్యాట్రిక్‌ వికెట్లు తీసిన అతడు పొట్టి ఫార్మాట్‌లో ఈ ఘనత సాధించిన తొలి భారత బౌలర్‌గా నిలిచాడు. అలాగే టీ20ల్లో అత్యుత్తమ గణాంకాలతో కొత్త చరిత్ర సృష్టించాడు.

ఇవీ చూడండి.. 2019.. టీమిండియా 'హ్యాట్రిక్' సంవత్సరం

ABOUT THE AUTHOR

...view details