తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ఇది కాదు.. ఇంకా ఉత్తమ ప్రదర్శన చేస్తా' - 'ఇది కాదు.. ఇంకా ఉత్తమ ప్రదర్శన చేస్తా'

గతేడాది జరిగిన ప్రపంచకప్​లో చోటు దక్కించుకోలేకపోయాడు ఇంగ్లాండ్ బౌలర్ డేవిడ్ విల్లే. కానీ మళ్లీ జట్టులోకి వచ్చిన ఇతడు ఐర్లాండ్​తో జరిగిన తొలి వన్డేలో ఐదు వికెట్లతో సత్తాచాటాడు. అయితే తనలో ఇంకా ఉత్తమ ప్రదర్శన దాగే ఉందని తెలిపాడు.

'ఇది కాదు.. ఇంకా ఉత్తమ ప్రదర్శన చేస్తా'
'ఇది కాదు.. ఇంకా ఉత్తమ ప్రదర్శన చేస్తా'

By

Published : Jul 31, 2020, 10:24 AM IST

ఐర్లాండ్​తో జరిగిన తొలి వన్డేలో విజయం సాధించింది ఇంగ్లాండ్. డేవిడ్ విల్లే ఐదు వికెట్లతో అద్భుత ప్రదర్శన చేశాడు. గతేడాది జరిగిన ప్రపంచకప్​ జట్టులో చోటు దక్కించుకోని విల్లే ఆడిన తొలి వన్డేలోనే సత్తాచాటాడు. అయితే ఈ ప్రదర్శనతో సంతృప్తి చెందనని.. తన మెరుగైన ప్రదర్శన ఇంకా ఉందని తెలిపాడు విల్లే.

"ఇంగ్లాండ్ జట్టుకు మళ్లీ ఆడటం ప్రత్యేకంగా ఉంది. ఈ గేమ్​ను చాలా ఎంజాయ్ చేశా. మళ్లీ జట్టులోకి రావడానికి చాలా కష్టపడ్డా. కానీ ఈరోజు మాత్రం ఆనందంగా ఉంది. ఇంకా నాలో ఉత్తమ ప్రదర్శన దాగే ఉంది."

-డేవిడ్ విల్లే, ఇంగ్లాండ్ క్రికెటర్

మొదటి వన్డేలో ఇంగ్లాండ్ విజయం

ఐర్లాండ్‌తో మూడు వన్డేల సిరీస్‌నూ దూకుడుగా మొదలెట్టింది ఇంగ్లాండ్. ప్రపంచకప్‌ సూపర్‌ లీగ్‌లో భాగంగా జరిగిన తొలి వన్డేలో ప్రత్యర్థిని 44.4 ఓవర్లలో 172 పరుగులకే ఆలౌట్‌ చేసిన ఇంగ్లీష్‌ జట్టు.. లక్ష్యాన్ని 27.5 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. బిల్లింగ్స్‌ (67 నాటౌట్‌; 54 బంతుల్లో 11×4), మోర్గాన్‌ (36 నాటౌట్‌; 40 బంతుల్లో 4×4, 2×6) జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు.

విల్లే ప్రదర్శన

ఛేదనలో ఒక దశలో 78 పరుగులకే 4 వికెట్లు పడినా.. ప్రత్యర్థిపై ఎదురుదాడి చేసిన ఈ జోడీ అభేధ్యమైన అయిదో వికెట్‌కు 96 పరుగులు జత చేసి ఇంగ్లాండ్‌ను గెలుపు తీరాలకు చేర్చింది. అంతకుముందు టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఐరిష్‌ జట్టును పేసర్‌ డేవిడ్‌ విల్లీ (5/30) వణికించాడు. అతను తన తొలి నాలుగు ఓవర్లలోనే నాలుగు వికెట్లు తీసి కోలుకోలేని దెబ్బ కొట్టాడు..

ABOUT THE AUTHOR

...view details