తెలంగాణ

telangana

ETV Bharat / sports

800వ వికెట్‌ ఎలా తీశాడో చెప్పిన ముత్తయ్య

సుదీర్ఘ ఫార్మాట్​లో 800 వికెట్లు తీసిన బౌలర్ శ్రీలంక దిగ్గజం​ ముత్తయ్య మురళీధరన్​ మాత్రమే. ఇప్పటివరకు ఈ ఫీట్​ ఎవరూ అందుకోలేకపోయారు. అయితే 800వ మైలురాయి వికెట్​ను ఎలా ఖాతాలో వేసుకున్నాడో తాజాగా అశ్విన్​తో జరిగిన ఇంటర్వ్యూలో వెల్లడించారు ముత్తయ్య.

muttiah muralitharan news
800వ వికెట్‌ ఎలా తీశాడో చెప్పిన ముత్తయ్య..!

By

Published : Aug 11, 2020, 2:11 PM IST

అంతర్జాతీయ క్రికెట్లో మహామహులను తన గింగిరాలు తిరిగే బంతులతో బోల్తా కొట్టించిన శ్రీలంక దిగ్గజం ముత్తయ్య మురళీధరన్‌ తొలుత పేస్‌ బౌలర్‌ అవుదామని అనుకున్నారట. పదమూడేళ్ల వయసులో ఎత్తు ఎక్కువ పెరగడం లేదని తన కోచ్‌ స్పిన్‌ బౌలింగ్‌కు మారమని సలహా ఇచ్చాడని ఆయన చెప్పారు. మొదట ఆఫ్‌స్పిన్‌ మాత్రమే వేశానని తర్వాత అన్ని అస్త్రాలు నేర్చుకున్నానని తెలిపారు. టీమ్‌ఇండియా సీనియర్‌ స్పిన్నర్‌ రవిచంద్రన్‌ అశ్విన్‌ 'డీఆర్‌ఎస్‌ విత్‌ అశ్విన్‌' షోలో ఆయన తమిళంలో సంభాషించారు.

సుదీర్ఘ ఫార్మాట్లో 800 వికెట్లు తీసిన ఏకైక బౌలర్‌ ముత్తయ్య మాత్రమే. ఆయన రికార్డుకు దరిదాపుల్లో ప్రస్తుతం ఎవ్వరూ లేరు. 800వ వికెట్‌గా ప్రజ్ఞాన్‌ ఓజాను ఔట్‌ చేశారు. అప్పుడు మైదానంలో ఏం జరిగిందో ఆయన వివరించారు.

"ప్రజ్ఞాన్‌ ఓజాతో నేనేమీ మాట్లాడలేదు. నీరు తాగిన తర్వాత ఇషాంత్‌తో సరదాగా మాట్లాడాను. ఆఖరి వికెట్‌ కాబట్టి షాట్లు ఆడాలని సూచించా. నువ్వెంత ప్రయత్నించినప్పటికీ భారత్‌ గెలవలేదు, కనీసం డ్రా కూడా చేసుకోలేదని అన్నాను. కనీసం నాకు వికెట్‌ ఇస్తే నేనైనా సంతృప్తి చెందుతానని చెప్పా. అయితే అతడు వికెట్‌ ఇవ్వకుండా 15 ఓవర్ల వరకు ఆడాడని బదులుగా తాను ప్రజ్ఞాన్‌ ఓజా వికెట్‌ దక్కించుకున్నాను" అని ముత్తయ్య వెల్లడించారు.

గాలె వేదికగా జరిగిన ఈ మ్యాచులో మొదటి ఇన్నింగ్స్‌లో ఆతిథ్య శ్రీలంక 520/8 పరుగుల వద్ద డిక్లేర్‌ చేసింది. అయితే ఆ తర్వాత మురళీధరన్‌ 5 వికెట్లతో చెలరేగడం వల్ల భారత్‌ 276కు పరిమితమై ఫాలో ఆన్‌ ఆడింది. ఆ ఇన్నింగ్స్‌లోనూ సచిన్‌, లక్ష్మణ్‌ పోరాడినా 338కే కుప్పకూలింది. శ్రీలంక పది వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఆఖరి వికెట్‌ కావడం వల్ల ఇషాంత్‌తో తాను సరదాగా మాట్లాడానని ముత్తయ్య అన్నారు.

ABOUT THE AUTHOR

...view details