ఈ ఏడాది రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న అవార్డుకు ఎంపికైన టీమ్ఇండియా వైస్ కెప్టెన్ రోహిత్ శర్మ.. అభిమానులకు కృతజ్ఞతలు తెలుపుతూ ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియా పంచుకున్నాడు. దేశానికి మరెన్నో పురస్కారాలు తీసుకువస్తానని అందులో పేర్కొన్నాడు. ఈ వీడియోపై మాజీ ఆల్‌రౌండర్ యువరాజ్ సింగ్ ఆసక్తికర కామెంట్ చేశాడు.
"నీ నోటిలో రెండు పక్కలా గులాబ్ జామూన్ పెట్టుకుని ఎలా మాట్లాడుతున్నావో చూస్తుంటే ఆశ్చర్యంగా ఉంది" అని రోహిత్ భార్య రితికను ట్యాగ్ చేశాడు. దీనికి స్పందించిన రితిక.. "మీరు ఈ ఖేల్‌రత్నను టీజ్ చేయండి" అంటూ రిప్లే ఇచ్చింది.
రోహిత్‌శర్మ వీడియోపై కామెంట్ చేసిన యువరాజ్, రోహిత్ భార్య రితిక ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా జాతీయ క్రీడా పురస్కారాలను కేంద్రప్రభుత్వం ప్రకటించింది. ఇందులో రాజీవ్‌గాంధీ ఖేల్‌రత్న అవార్డుకు ఐదుగురు క్రీడాకారులు ఎంపికయ్యారు. వారిలో క్రికెటర్ రోహిత్‌శర్మ, పారా అథ్లెట్ మరియప్పన్ తంగవేలు, టేబుల్ టెన్నిస్ ఛాంపియన్ మనికా బత్రా, రెజ్లర్ వినేశ్ ఫొగాట్, మహిళల హాకీ జట్టు కెప్టెన్ రాణి రాంపాల్ ఉన్నారు.
ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారాన్ని అందుకున్న క్రికెటర్లలో సచిన్ తెందూల్కర్, మహేంద్ర సింగ్ ధోనీ, విరాట్ కోహ్లీ ఉన్నారు. ఇప్పుడు రోహిత్ నాలుగో క్రికెటర్‌గా గుర్తింపు పొందాడు. భారత జట్టుకు పూర్తి స్థాయి కెప్టెన్‌గా వ్యవహరించని ఓ క్రికెటర్ ఈ అవార్డు అందుకోవడం ఇదే తొలిసారి కావడం విశేషం.