తెలంగాణ

telangana

ETV Bharat / sports

కీపింగ్​ మానేద్దామనుకుంటున్నా...: ముష్ఫికర్​​ రహీమ్​ - Cricket news,Live Score,Cricket,wicket-keeper,test Cricket,Mushfiqur Rahim,International cricket council,india national cricket team,Bangladesh Premier League,Bangladesh national cricket team

బంగ్లాదేశ్​ సీనియర్​ క్రికెటర్​ ముష్ఫికర్​​ రహీమ్ టెస్టుల్లో కీపింగ్​ బాధ్యతలకు గుడ్​బై చెప్పే యోచనలో ఉన్నాడు. పనిభారం తగ్గించుకొని బ్యాటింగ్​పై మరింత దృష్టిపెట్టేందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నాడట.

కీపింగ్​ మానేద్దామనుకుంటున్నా...: ముష్ఫికర్​​ రహీమ్​

By

Published : Oct 28, 2019, 9:06 AM IST

బంగ్లాదేశ్​ మాజీ కెప్టెన్​ ముష్ఫికర్​ రహీమ్... తెలుపు జెర్సీలో​ ఇకపై వికెట్ల వెనుక కనిపించకపోవచ్చు. టెస్టుల్లో కీపింగ్​ బాధ్యతల నుంచి తప్పుకొనే యోచనలో ఉన్నట్లు తాజాగా వెల్లడించాడు. ఈ మేరకు బంగ్లా కోచ్​ రసెల్​ డోమింగ్​తో కూడా చర్చించినట్లు తెలిపాడు. అయితే యాజమాన్యం దీనిపై తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉందట.

వికెట్​ కీపర్​ ముష్ఫికర్​​ రహీమ్​

" టెస్టుల్లో కీపింగ్​ చేయాలని లేదు. త్వరలో మూడు ఫార్మాట్లలో చాలా మ్యాచ్​లు ఉన్నాయి. అంతర్జాతీయ క్రికెట్​తో పాటు ఢాకా ప్రీమియర్​ లీగ్​, బంగ్లా ప్రీమియర్​ లీగ్​లలోనూ ఆడుతున్నాను. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకొని కాస్త పనిభారం తగ్గించుకోవాలని అనుకుంటున్నా. ముఖ్యంగా బ్యాటింగ్​పై ఎక్కువ దృష్టిపెట్టాలని ఉంది".
--ముష్ఫికర్​ రహీమ్​, బంగ్లాదేశ్​ క్రికెటర్​

గత ఐదేళ్లుగా ఎలాంటి గాయాలు లేకుండా క్రికెట్​లో ఉన్న ముష్ఫికర్​.. సరైన విశ్రాంతి లేకుండా మ్యాచ్​లు ఆడుతున్నట్లు వెల్లడించాడు. అందుకే టెస్టుల్లో కీపింగ్​ బాధ్యతలను వేరొకరికి అప్పగించాలని చూస్తున్నట్లు చెప్పాడు.

ముష్ఫికర్​ బ్యాటింగ్​

2004లోనే జాతీయ స్థాయి క్రికెట్​లో అడుగుపెట్టిన ఈ ఆటగాడు... వచ్చే నెలలో భారత్​తో టెస్టు సిరీస్​ నుంచే కీపింగ్ నుంచి వైదొలగనున్నట్లు సమాచారం.​ ప్రస్తుతం ఈ ఆటగాడు మూడు ఫార్మాట్లతో పాటు దేశవాళీ టీ20 లీగ్​ల్లోనూ ఆడుతున్నాడు. ఇప్పటికే 67 టెస్టులు ఆడిన ముష్ఫికర్​.. 103 క్యాచ్​లు, 31 స్టంపింగ్​లు చేశాడు. 55 టెస్టుల్లో మాత్రమే బ్యాటింగ్​ చేసే అవకాశం వచ్చింది. వాటిలో 3, 515 పరుగులు చేశాడు.

ABOUT THE AUTHOR

...view details