బంగ్లాదేశ్లో బంగబంధు టీ20 కప్ ప్లేఆఫ్స్ సందడిగా సాగుతున్నాయి. అయితే సోమవారం జరిగిన మ్యాచ్లో ఓ సంఘటన చర్చనీయాంశమైంది. క్యాచ్ పడుతుండగా తనకు అడ్డొచ్చాడని సహచర ఆటగాడినే వికెట్ కీపర్ ముస్ఫీకర్ రహీమ్ ఏకంగా కొట్టబోయాడు.
క్రికెట్ మైదానంలో కొట్లాట.. బంగ్లా టీ20 కప్లో ఘటన - Mushfiqur Rahim Bangabandhu T20 Cup news
తాను క్యాచ్ పడుతుంటే అడ్డొచ్చాడని, సహచర ఆటగాడిని కొట్టేందుకు సిద్ధమయ్యాడు బంగ్లాదేశ్ ఆటగాడు ముస్ఫీకర్ రహీమ్. ఈ సంఘటన బంగ్లా టీ20 కప్లో జరిగింది.
ఇంతకీ ఏం జరిగింది?
బెక్సిమ్కో ఢాకా జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ముస్ఫీకర్ రహీమ్.. ఫార్చూన్ బరిసల్తో జరిగిన ఎలిమినేటర్ పోరులో ఓ క్యాచ్ పట్టాడు. అయితే దీని కోసం సహచర ఆటగాడు నసూమ్ కూడా ప్రయత్నించాడు. దీంతో వీరిద్దరూ ఒకరిని ఒకరు ఢీ కొట్టారు. క్యాచ్ పట్టిన అనంతరం నసూమ్పైకి చేయెత్తి కొట్టబోయాడు రహీమ్. ఇతర ఆటగాళ్లు వారిస్తున్న సరే అతడితో గొడవపడ్డాడు. ప్రస్తుతం ఈ వీడియో వైరల్గా మారింది. ఈ మ్యాచ్లో 9 పరుగుల తేడాతో ఢాకా జట్టు విజయం సాధించి ముందడుగు వేసింది.