ఐపీఎల్ కోసం యూఏఈలో ఉన్న చెన్నై సూపర్‌కింగ్స్ క్రికెటర్లు, గతవారం నుంచి ప్రాక్టీసు మొదలుపెట్టారు. లీగ్ ప్రారంభానికి మరో 8 రోజులే ఉండటం వల్ల ప్రాక్టీసులో డోసు పెంచారు. గురువారం జట్టులోని ఆటగాళ్ల మధ్య మ్యాచ్ నిర్వహించారు. కెప్టెన్ ధోనీ అద్భుతమైన సిక్స్ కొట్టగా, అది చూసి ఆశ్చర్యపోవడం మురళీ విజయ్ వంతైంది. సీఎస్కే మేనేజర్ రాధాకృష్టన్ తీసిన ఆ వీడియోను సీఎస్క్ ట్వీట్ చేసింది.
ఈ మ్యాచ్‌లో లాంగ్‌ఆన్‌లో ఉన్న మురళీ విజయ్ మీదుగా ధోనీ సిక్సర్ కొట్టాడు. దాన్ని చూసి.. "అద్భుతమైన టైమింగ్, బ్యాట్ స్పీడ్, స్వింగ్ లాంటి ధోనీకి పుట్టుకతోనే వచ్చాయి. అతడి కంటే బాగా ఆడలేం" అని అన్నాడు.