తెలంగాణ

telangana

ETV Bharat / sports

లంక ప్రీమియర్ లీగ్​ వేలంలో మునాఫ్ పటేల్ - లంక ప్రీమియర్ లీగ్​ వేలంలో మునాఫ్ పటేల్

లంక ప్రీమియర్ లీగ్​లో ఆడేందుకు టీమ్​ఇండియా మాజీ పేసర్ మునాఫ్ పటేల్ ఆసక్తి చూపిస్తున్నాడు. శ్రీలంక బోర్డు తొలిసారి నిర్వహిస్తున్న ఈ టీ20 లీగ్ వేలంలో అతడు పాల్గొనబోతున్నాడు.

Munaf Patel to be auctioned for Lanka Premier League
లంక ప్రీమియర్ లీగ్​ వేలంలో మునాఫ్ పటేల్

By

Published : Sep 12, 2020, 4:03 PM IST

నవంబర్‌లో ప్రారంభంకానున్న లంక ప్రీమియర్‌ లీగ్‌లో టీమ్‌ఇండియా మాజీ పేసర్‌ మునాఫ్‌ పటేల్‌ ఆడేందుకు సిద్ధమవుతున్నాడు. శ్రీలంక క్రికెట్‌ బోర్డు తొలిసారి నిర్వహిస్తున్న ఈ టీ20 లీగ్‌ వేలంలో అతడు పాల్గొనబోతున్నాడు. అక్టోబర్‌ 1న నిర్వహిస్తున్న ఈ వేలం కోసం సుమారు 150 మంది విదేశీ ఆటగాళ్లు ఆసక్తి చూపిస్తున్నారు. అందులో మునాఫ్ కూడా ఉన్నాడు.

నవంబర్‌ 14 నుంచి డిసెంబర్‌ 6 వరకు శ్రీలంకలో ఐదు ఫ్రాంచైజీలతో ప్రీమియర్‌ లీగ్‌ను నిర్వహించాలని ఆ దేశ క్రికెట్‌ బోర్డు నిర్ణయించింది. ఈ క్రమంలో ప్రతి జట్టులో ఆరుగురు విదేశీ ఆటగాళ్లు, 13 మంది స్వదేశీయులతో మొత్తం 19 మంది చొప్పున ఉండేలా ప్రణాళికలు రూపొందించింది. దీంతో మొత్తంగా చూస్తే 30 మంది విదేశీయులు ఈ వేలంలో ఎంపికయ్యే అవకాశం ఉంది. కాగా, తొలుత ఈ టోర్నీని ఆగస్టులోనే నిర్వహించాలని చూసినా కరోనా వైరస్‌ పరిస్థితుల కారణంగా అది వాయిదా పడింది. ఇప్పుడిక అన్ని క్రీడలూ జరుగుతున్న నేపథ్యంలో లంక బోర్డు కూడా ముందడుగు వేసింది.

ఈ లీగ్​ వేలంలో పాల్గొనబోతున్న వారిలో విదేశాల నుంచి పాకిస్థాన్‌ మాజీ కెప్టెన్‌ షాహిద్‌ అఫ్రిది, ఇంగ్లాండ్‌ ఆటగాడు రవి బొపారా, బంగ్లాదేశ్ స్టార్‌ ఆల్‌రౌండర్‌ షకిబుల్ హసన్, వెస్టిండీస్‌ మాజీ కెప్టెన్‌ డారెన్‌ బ్రావో, దక్షిణఫ్రికా స్టార్‌ కొలిన్‌ మున్రో తదితరులు ఉన్నారు.

ABOUT THE AUTHOR

...view details