విజయ్ హజారే ట్రోఫీ ఫైనల్లో గెలిచిన ముంబయి.. నాలుగోసారి ట్రోఫీని ముద్దాడింది. ఆదివారం జరిగిన మ్యాచ్లో ఉత్తర్ప్రదేశ్ జట్టును ఆరు వికెట్ల తేడాతో ఓడించింది. ఆదిత్యా ఠాక్రే (107) సెంచరీతో మెరవగా.. పృథ్వీ షా(73), శివమ్ దూబె(42) రాణించారు. మిగతా బ్యాట్స్మెన్ పర్వాలేదనిపించారు. ప్రత్యర్థి బౌలర్లలో యశ్ దయాల్, శివమ్ మావి, శివమ్ శర్మ తలో వికెట్ తీశారు.
విజయ్ హజారే ట్రోఫీ విజేతగా ముంబయి - mumbai team won vijay hazare trophy 2021
ఈ సీజన్ విజయ్ హజారే ట్రోఫీని ముంబయి సొంతం చేసుకుంది. తుదిపోరులో ఉత్తర్ప్రదేశ్పై గెలిచి నాలుగోసారి విజేతగా నిలిచింది.
![విజయ్ హజారే ట్రోఫీ విజేతగా ముంబయి vijay](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-11005069-564-11005069-1615719957485.jpg)
విజయ్
తొలుత బ్యాటింగ్ చేసిన ఉత్తరప్రదేశ్లో మాధవ్ కౌశిక్(158)సెంచరీ చేయగా, సామ్రాట్ సింగ్(55), అక్ష్దీప్ నాథ్(55) అర్ధ శతకాలతో ఆకట్టుకున్నారు. దీంతో నిర్ణీత 50 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి 312 పరుగులు చేసిందీ జట్టు.