వర్షాల ధాటికి ముంబయి స్టేడియం ధ్వంసం - mumbai rain news
కుండపోతగా కురుస్తున్న వర్షాల వల్ల ముంబయిలోని డీవై పాటిల్ స్టేడియం బాగా దెబ్బతింది. భారీగా నష్టం వాటిల్లింది.
ముంబయిలోని డీవై పాటిల్ క్రికెటర్ స్టేడియం
భారీ వర్షాల ధాటికి ముంబయిలోని ప్రఖ్యాత డీవై పాటిల్ స్టేడియం దారుణంగా దెబ్బతింది. పైకప్పులు విరిగి కిందపడటం సహా స్టేడియంలో పలుచోట్ల విధ్వంసం చోటు చేసుకుంది. కొన్ని రోజులుగా ముంబయిని వర్షాలు ముంచెత్తుతున్నాయి. దీనికి గాలులు కూడా తోడవుతుండటం వల్ల పెద్ద పెద్ద భవనాలు సైతం దెబ్బతింటున్నాయి. ఈ క్రమంలోనే డీవై పాటిల్ స్టేడియంలోనూ భారీగానే నష్టం వాటిల్లింది.
Last Updated : Aug 6, 2020, 7:43 AM IST