భారత్‌లో ప్రస్తుతం లాక్డౌన్ అమల్లో ఉంది. దీంతో అన్ని రాష్ట్రాల్లో పోలీసులు తమ బాధ్యతలు నిర్వర్తిస్తూ ప్రజలెవరూ బయటకు రాకుండా చూస్తున్నారు. వారిని ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్నారు. అయితే ముంబయి పోలీసులు కాస్త విభిన్న ప్రయత్నం చేశారు. 2011 ప్రపంచకప్ ఫైనల్లో ధోనీ కొట్టిన విన్నింగ్ సిక్స్‌ను ఇందుకోసం ఉపయోగించారు. ఆ ఫొటోను ట్వీట్ చేసి, జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు చెప్పారు.
లాక్డౌన్ కోసం ధోనీ సిక్స్‌ను ఉపయోగించిన పోలీసులు - cricket news
2011 ప్రపంచకప్ ఫైనల్లో ధోనీ కొట్టిన విన్నింగ్స్ సిక్స్‌ను కరోనాపై అవగాహన కోసం ఉపయోగించారు ముంబయి పోలీసులు. ఆ ఫొటోను ట్వీట్ చేసి, జాగ్రత్తగా ఉండాలని ప్రజలకు సూచించారు.
ధోనీ
"2011 ప్రపంచకప్‌ను టీమిండియా గెలుచుకున్నప్పుడు ఇంట్లోనే ఉన్నాం. ఇప్పుడు ఇళ్లలోనే ఉండి, భారత్ లక్ష్యాన్ని ఛేదించే సమయం కోసం ఎదురుచూస్తున్నాం" -ముంబయి పోలీసులు ట్వీట్
ప్రస్తుతం భారత్‌లో 2301 మందికి కరోనా సోకగా, 56 మంది మరణించారు. ప్రపంచవ్యాప్తంగా 54,194 మంది మృతిచెందారు.