తెలంగాణ

telangana

ETV Bharat / sports

బౌలింగ్ ఎంచుకున్న ముంబయి.. రోహిత్ దూరం - kings elavan punjab

వాంఖడే వేదికగా ముంబయి ఇండియన్స్- కింగ్స్​ ఎలెవన్ పంజాబ్ మధ్య జరుగుతున్న మ్యాచ్​లో టాస్ గెలిచిన ముంబయి బౌలింగ్ ఎంచుకుంది.

ఐపీఎల్

By

Published : Apr 10, 2019, 7:54 PM IST

ఐపీఎల్ 12వ సీజన్​లో ఆరు మ్యాచ్​లు ఆడిన పంజాబ్ నాలుగింటిలో విజయం సాధించంగా.. ఐదు మ్యాచ్​ల్లో మూడు విజయాలతో ఉంది ముంబయి ఇండియన్స్ జట్టు. ఈ రెండు జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్​లో టాస్ గెలిచిన ముంబయి బౌలింగ్ ఎంచుకుంది.

ప్రాక్టీస్​లో రోహిత్​కు గాయం కాగా ముంబయికి కెప్టెన్​గా పొలార్డ్ వ్యవహరించనున్నాడు. చెన్నై సూపర్ కింగ్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లపై విజయంతో ముంబయి జోరుమీదుంది. నాణ్యమైన బౌలింగ్ ఈ జట్టు సొంతం. డికాక్, సూర్యకుమార్ యాదవ్, పొలార్డ్, పాండ్య సోదరులతో బ్యాటింగ్ దళం బలంగా ఉంది. రోహిత్ లేకపోవడం జట్టుకు లోటు అనే చెప్పొచ్చు.

జట్లు
ముంబయి ఇండియన్స్
పొలార్డ్ (కెప్టెన్), సిద్దేశ్ లాడ్, బెరెన్​డార్ఫ్​, సూర్యకుమార్ యాదవ్, డికాక్, బుమ్రా, హార్దిక్ పాండ్య, ఇషాన్ కిషన్, అల్జారీ జోసెఫ్, కృనాల్ పాండ్య, రాహుల్ చాహర్

కింగ్స్ ఎలెవన్ పంజాబ్
రవిచంద్రన్ అశ్విన్(కెప్టెన్​), లోకేష్ రాహుల్, క్రిస్ గేల్, కరుణ్ నాయర్, సర్ఫ్​రాజ్ ఖాన్, మిల్లర్, మన్​దీప్ సింగ్, సామ్ కరన్, అంకిత్ రాజ్ పుత్, షమి, హార్ధస్ విజియోన్

ABOUT THE AUTHOR

...view details