తెలంగాణ

telangana

ETV Bharat / sports

ముంబయి బౌలింగ్... దిల్లీ బ్యాటింగ్ - వాంఖడే

ముంబయి వాంఖడే వేదికగా జరుగుతున్న మ్యాచ్​లో ముంబయి జట్టు టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది.

ముంబయి బౌలింగ్... దిల్లీ బ్యాటింగ్

By

Published : Mar 24, 2019, 7:56 PM IST

Updated : Mar 25, 2019, 10:25 AM IST

ముంబయి ఇండియన్స్, దిల్లీ క్యాపిటల్స్ మధ్య జరుగుతున్న మ్యాచ్​లో ముంబయి టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. ముంబయి వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్​లో అందరి చూపు ముంబయి జట్టులోని కీలక ఆటగాళ్లయిన హార్దిక్ పాండ్యా, బుమ్రాపైనే .

  • రోహిత్ శర్మ సారథ్యంలో వారు ఎలాంటి మెరుపులు మెరిపిస్తారోనని అభిమానులు ఎదురుచూస్తున్నారు. బ్యాటింగ్​లో అలరించేందుకు యువరాజ్, పొలార్డ్, కటింగ్, సూర్యకుమార్ యాదవ్ ఉండనే ఉన్నారు. బౌలింగ్​లో బరిందర్, మెక్లెనగన్ పేస్ బాధ్యతలు పంచుకోనున్నారు. స్పిన్ బౌలింగ్​ను కృనాల్, జయంత్, మయాంక్ చూసుకోనున్నారు.

దిల్లీ జట్టు ఈ సీజన్​ నుంచి పేరు మార్చుకుని దిల్లీ క్యాపిటల్స్​గా బరిలోకి దిగనుంది. ధావన్ రాకతో జట్టుకు బలం చేకూరింది. యువ క్రీడాకారులు పృథ్వీ షా, కెప్టెన్ శ్రేయస్ అయ్యర్, పంత్ బ్యాటింగ్​లో మెరిసేందుకు సిద్ధంగా ఉన్నారు. బౌల్ట్, ఇషాంత్ శర్మ, రబాడా, నాథు సింగ్​లతో దిల్లీ బౌలింగ్ లైనప్ బలంగా ఉంది.
జట్లు

Last Updated : Mar 25, 2019, 10:25 AM IST

ABOUT THE AUTHOR

...view details