ముంబయి బ్యాట్స్‌మన్ సర్ఫరాజ్ ఖాన్ ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో అరుదైన రికార్డు సాధించాడు. ప్రస్తుతం జరుగుతోన్న రంజీ క్రికెట్‌లో జోరుమీదున్న అతడు మంగళవారం సౌరాష్ట్రతో జరిగిన మ్యాచ్‌లో అర్ధ శతకంతో మెరిశాడు. సర్ఫరాజ్ 78 పరుగుల వద్ద ఉండగా కమ్‌లేశ్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు. ఫలితంగా రంజీల్లో.. 605 పరుగుల తర్వాత తొలిసారి ఔటయ్యాడు. గత రెండు మ్యాచ్‌ల్లో ట్రిపుల్ సెంచరీ(301), డబుల్ సెంచరీ(226) చేసిన సర్ఫరాజ్ నాటౌట్‌గా నిలిచి రికార్డు సృష్టించాడు.
ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో సర్ఫరాజ్ రికార్డు - Mumbai Batsman Sarfaraz Khan Massive record
ఫస్ట్ క్లాస్ క్రికెట్‌లో ముంబయి బ్యాట్స్‌మన్ సర్ఫరాజ్ అహ్మద్ అరుదైన ఘనత సాధించాడు. సౌరాష్ట్రతో జరిగిన మ్యాచ్‌లో 78 పరుగులు చేసిన ఈ యువ ఆటగాడు ఓ రికార్డూ సృష్టించాడు.
అంతకుముందు తమిళనాడు క్రికెటర్ డబ్ల్యూవీ రామన్ 1989లో ఫస్ట్‌క్లాస్ క్రికెట్‌లో వరుస మ్యాచ్‌ల్లో ఇలా ట్రిపుల్ సెంచరీ, డబుల్ సెంచరీ (313, 200*) చేశాడు. ఆ తర్వాత ఈ రికార్డు నెలకొల్పిన తొలి క్రికెటర్‌గా సర్ఫరాజ్ నిలిచాడు. సౌరాష్ట్రతో జరిగిన తొలి రోజు ముంబయి 4 వికెట్ల నష్టానికి 88 పరుగులు చేసి కష్టాల్లో ఉండగా సర్ఫరాజ్ ఆదుకున్నాడు. మరో బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్ ఆడి శతకం వైపు దూసుకెళ్తుండగా కమ్‌లేశ్ మక్‌వానా ఔట్ చేశాడు.
ఇవీ చూడండి.. అండర్ 19: పాక్‌ను చిత్తు చేసిన భారత్.. ఫైనల్లో ప్రవేశం