తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఆంధ్రా కుర్రాళ్లకు మెక్​గ్రాత్​ క్రికెట్​ పాఠాలు

ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్​ గ్లెన్​ మెక్​గ్రాత్..​ గుంటూరు జిల్లా మంగళగిరికి వచ్చాడు. ఆంధ్రా క్రికెట్​ అసోసియేషన్​ ఆధ్వర్యంలోని అంతర్జాతీయ క్రీడా మైదానాన్ని సందర్శించాడు. ఎమ్​ఆర్​ఎఫ్​ పేస్​ ఫౌండేషన్​ ద్వారా ఆటగాళ్లకు తర్ఫీదు ఇచ్చేందుకు 2 రోజుల పాటు ఇక్కడ ఉండనున్నాడు.

మెక్​గ్రాత్

By

Published : Aug 10, 2019, 5:21 PM IST

ఎమ్​ఆర్​ఎఫ్​ పేస్​ ఫౌండేషన్​లో మెక్​గ్రాత్

ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్​ గ్లెన్​ మెక్​గ్రాత్..​ ఆంధ్రప్రదేశ్​ యువ ఆటగాళ్లకు క్రికెట్​ మెళకువలు నేర్పించనున్నాడు. అందుకోసం మంగళగిరికి వచ్చిన ఈ బౌలర్.. ఈటీవీ భారత్​తో మాట్లాడాడు. స్లెడ్జింగ్​పై తన అభిప్రాయాలు సహా​ బౌలర్లు ఏ విధంగా సన్నద్ధమవ్వాలో చెప్పాడు.

స్లెడ్జింగ్​

"స్లెడ్జింగ్‌ ఆరోగ్యకరంగా ఉన్నంత సేపు ఎవరికీ ఎలాంటి ఇబ్బంది ఉండదు. అది వ్యక్తిగతంగా, అవమానకరంగా మారితే మంచిది కాదు" అని అభిప్రాయపడ్డాడు ఆస్ట్రేలియా దిగ్గజ ఫాస్ట్‌బౌలర్‌ మెక్​గ్రాత్.

"స్లెడ్జింగ్​ అనేది దూషించడం లేదా కొట్టుకోవడం కాదు. వ్యక్తిగతంగా అవమానించేలా ఉండకూడదు. మైదానంలో జరిగే ఆరోగ్యకరమైన పోటీలో భాగమది. దాన్ని తప్పుగా నేనైతే భావించను. ఇలాంటివి క్రికెట్​లో ఒక్కోసారి జరుగుతుంటాయి. సచిన్​, నాకు మధ్య ఇలాంటి చిన్న ఘర్షణ ఒకసారి జరిగింది. ఎదుటి వ్యక్తిని దూషించడం అసలు క్రికెట్​లో ఉండకూడదు. అది మంచి పద్ధతి కాదు." -గ్లెన్ మెక్​గ్రాత్, ఆస్ట్రేలియా మాజీ బౌలర్

దిగ్గజ క్రికెటర్ మెక్​గ్రాత్.. మంగళగిరికి రావడం తనకెంతో ఆనందంగా ఉందని చెప్పారు చీఫ్ సెలక్టర్​ ఎమ్మెస్కే ప్రసాద్. అతడి శిక్షణలో మెళకువలు నేర్చుకునేందుకు కుర్రాళ్లకు ఇది మంచి అవకాశమని అన్నారు.

ఇవీ చూడండి.. బీసీసీఐ-నాడా బంధంపై క్రీడా శాఖ మంత్రి హర్షం

ABOUT THE AUTHOR

...view details