చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ.. మరోసారి అభిమానుల మనసు గెల్చుకున్నాడు. స్టార్ హోదాలో ఉన్నా సరే ఓ సాధారణ ఆటగాడిలా వ్యవహరించాడు. అంతర్జాతీయ క్రికెట్‌కు ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించిన మహీ.. ఐపీఎల్ కోసం జట్టుతో పాటు యూఏఈకి వెళ్లాడు. అయితే ప్రత్యేక విమానంలో తనకు కేటాయించిన బిజినెస్ క్లాస్ టికెట్‌ను ఫ్రాంఛైజీ డైరెక్టర్ కె.జార్జ్ జాన్ కోసం వదులుకుని, ఎకానమీ క్లాస్‌లో అందరితో కలిసి కూర్చున్నాడు.
అతడికి బిజినెస్ క్లాస్ ఇచ్చి.. ధోనీ మాత్రం అక్కడ? - latest dhoni retirement news
మరోసారి పెద్ద మనసును చాటుకున్న ధోనీ.. చెన్నై ఫ్రాంఛైజీ డైరెక్టర్‌కు బిజినెస్ క్లాస్ టికెట్ ఇచ్చి,తాను మాత్రం ఎకానమీ క్లాస్‌లో ప్రయాణించాడు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
ధోనీ
జాన్‌కు పొడవాటి కాళ్లు ఉన్నందున ఎకానమీ క్లాస్ సీట్లో అసౌకర్యానికి గురయ్యాడు. దీనిని గమనించిన ధోనీ.. తన సీటును అతడికి మనసు చాటుకున్నాడు. ఈ వీడియోను జాన్ స్వయంగా ట్వీట్ చేశాడు. దీంతో ధోనీపై అభిమానులు ప్రశంసలు కురిపిస్తున్నారు.