తెలంగాణ

telangana

ETV Bharat / sports

పంత్, శాంసన్​ను ధోనీ గమనిస్తున్నాడు: లక్ష్మణ్​ - vvs lakshman

రిషభ్ పంత్, సంజూ శాంసన్ ప్రదర్శనను గమనిస్తూ.. వారు విఫలమైన సందర్భంలో ధోనీ జట్టులోకి వస్తాడని వీవీఎస్ లక్ష్మణ్​ అన్నాడు. బహుశా ధోనీ ఆలోచన కూడా ఇదే అయ్యుంటుందని తెలిపాడు.

MS Dhoni will wait with patience to see how Rishabh Pant, Sanju Samson perform: VVS Laxman
వీవీఎస్ లక్ష్మణ్

By

Published : Nov 29, 2019, 5:20 AM IST

మహేంద్ర సింగ్ ధోనీ తర్వాత వికెట్ కీపింగ్​లో అతడి స్థానాన్ని భర్తీ చేసే ఆటగాళ్లలో రిషభ్​ పంత్, సంజూ శాంసన్ ముందు వరుసలో ఉన్నారు. ఈ అంశంపై భారత మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్​ స్పందించాడు. ప్రస్తుతం ధోనీ జట్టుకు దూరంగా ఉన్న నేపథ్యంలో పంత్, శాంసన్ తమను తాము నిరూపించుకోవాలని, బహుశా మహీ కూడా ఇదే అనుకుంటున్నాడేమో అని అభిప్రాయపడ్డాడు.

"రిషభ్ పంత్, సంజూ శాంసన్​ ప్రదర్శనను ధోనీ సహనంగా గమనిస్తున్నాడని నేననుకుంటున్నా. మహీ జట్టులోకి ఎప్పుడొచ్చినా ఐపీఎల్ తర్వాతే తన నిర్ణయాన్ని ప్రకటిస్తాడనుకుంటున్నా. ఇద్దరు ఆటగాళ్లు(పంత్, శాంసన్) తమకొచ్చిన అవకాశాన్ని వినియోగించుకోలేకపోతే.. మహీ పునరాగమనం చేసి టీ20 ప్రపంచకప్​ వరకు జట్టును ముందుండి నడిపిస్తాడు. మహీ ఆలోచన కూడా ఇదే కాబోలు. ఫామ్ తెచ్చుకునేందుకు అతడికి ఐపీఎల్​ చక్కటి వేదిక." - వీవీఎస్ లక్ష్మణ్, టీమిండియా మాజీ క్రికెటర్.

ఇరువురు ఆటగాళ్లల్లో మొదటి అవకాశం రిషభ్ పంత్​కే వస్తుందని, అతడి ప్రత్యామ్నాయంగా సంజూ శాంసన్​ను పరిశీలించాలని లక్ష్మణ్ అన్నాడు.
ప్రపంచకప్ తర్వాత జట్టుకు దూరంగా ఉన్న ధోనీ రిటైర్మెంట్​పై ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. 2020 జనవరి వరకు ఈ అంశంపై ప్రశ్నించవద్దని ఇటీవలే ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. చివరగా మహీ వరల్డ్​కప్ సెమీస్​లో న్యూజిలాండ్​పై ఆడాడు.

ఇదీ చదవండి: 'హోబర్ట్'​తో సానియా మీర్జా రెండో ఇన్నింగ్స్​...!

ABOUT THE AUTHOR

...view details