తెలంగాణ

telangana

ETV Bharat / sports

అభిమానులకు శుభవార్త... ఫిబ్రవరి 8న బరిలోకి ధోనీ! - dhoni latest match

టీమిండియా మాజీ సారథి ఎంఎస్​ ధోనీ భవితవ్యంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఇలాంటి సమయంలో మరో వార్త అభిమానులకు తీపి కబురు అందించింది. 2019 ప్రపంచకప్​లో భారత్​ సెమీఫైనల్లో ఓడిన తర్వాత అంతర్జాతీయ మ్యాచ్​ ఆడని మహీ... ఫిబ్రవరి 8న ఆస్ట్రేలియా వేదికగా మళ్లీ మైదానంలో సందడి చేయనున్నట్లు తెలుస్తోంది.

MS Dhoni will play 1st game after world cup exit in the charity game, Australia?
అభిమానులకు శుభవార్త... ఫిబ్రవరి 8న ధోనీ తొలి మ్యాచ్​

By

Published : Jan 18, 2020, 1:43 PM IST

టీమిండియా మాజీ సారథి మహేంద్ర సింగ్​ ధోనీకి అభిమానుల్లో ఉండే క్రేజ్​ వేరు. 2019 ప్రపంచకప్​ సెమీస్​ మ్యాచ్​లో భారత్​ ఓడిన తర్వాత మహీ అంతర్జాతీయ క్రికెట్​లో బరిలోకి దిగలేదు. తాజాగా మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టనున్నాడట. అయితే ఈసారి ఒంటరిగా కాకుండా భారత దిగ్గజ క్రికెటర్​ సచిన్​ తెందూల్కర్​తో కలిసి ఆడనున్నట్లు సమాచారం. అదేంటి సచిన్​ 2013లోనే క్రికెట్​కు వీడ్కోలు పలికాడని అనుకుంటున్నారా..? ఇదంతా ఓ ఛారిటీ మ్యాచ్​ కోసం చేయనున్నట్లు తెలుస్తోంది.

బిగ్​బాష్​ ఫైనల్​ ముందు...

ఈ మధ్య కాలంలో ఆస్ట్రేలియాలో కార్చిచ్చు కారణంగా కోట్లాది వన్య ప్రాణులు చనిపోయాయి. అంతేకాకుండా ఎంతో మంది నిరాశ్రయులయ్యారు. వారిని ఆదుకునేందుకు విరాళాలు సేకరిస్తున్న ఓ సంస్థ తరఫున ఈ మ్యాచ్​ ఆడనున్నారట సచిన్​, మహీ. ఇప్పటికే క్రికెట్​ ఆస్ట్రేలియా ఈ విషయమై ఇద్దర్నీ సంప్రదించిందట. ఈ మ్యాచ్​లో తలపడే రెండు జట్లకు ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్లు షేన్​వార్న్​ , రికీ పాంటింగ్​ కెప్టెన్లుగా ఉండనున్నారు. ఇటీవలె మ్యాచ్​ తేదీని ప్రకటించింది ఆస్ట్రేలియా క్రికెట్​ బోర్డు.

ఆల్​ స్టార్​-టీ20 పేరుతో ఈ మ్యాచ్​ జరగనుంది. ఫిబ్రవరి 8న బిగ్​బాష్​ లీగ్​(బీబీఎల్​) ఫైనల్​కు ముందు నిర్వహించనున్నారు. ఇందులో మాజీ క్రికెటర్లు బ్రెట్​ లీ, జస్టిన్​ లాంగర్​, మైకేల్​ క్లార్క్​, అడమ్​ గిల్​క్రిస్ట్​, ,షేన్​ వాట్సన్​, ఆలెక్స్​ బ్లాక్​వెల్​ పాల్గొనున్నారు. అంతేకాకుండా స్టీవ్​ వా, మహిళా క్రీడాకారిణి మేల్​ జోన్స్​ వ్యాఖ్యాతలుగా వ్యవహరించనున్నారు. ఈ మ్యాచ్​ ద్వారా వచ్చే ఆదాయాన్ని ఆస్ట్రేలియా రెడ్​ క్రాస్ సంస్థకు అందజేయనున్నారు.

ఇదేం కొత్తకాదు..!

జాతీయ విపత్తులు సంభవించి నష్టం జరిగినప్పుడు... బాధితులను ఆదుకునేందుకు ఇలాంటి ఛారిటీ క్రికెట్​ మ్యాచ్​లు చాలాసార్లు నిర్వహించారు. 2015లో వరల్డ్​ ఎలెవన్​ వర్సెస్​ ఆసియా ఎలెవన్​ మధ్య ఇలాంటి మ్యాచ్​ మెల్​బోర్న్​లో జరిగింది. ఈ మ్యాచ్​ ద్వారా వచ్చిన విరాళాలను సునామీ బాధితులకు అందజేశారు. పాంటింగ్​, వార్న్​, తెందూల్కర్​, బ్రయన్​ లారా, ముత్తయ్య మురళీధరన్​ ఈ మ్యాచ్​లో ఆడారు.

2019 ప్రపంచకప్​ తర్వాత ధోనీ క్రికెట్​ ఆడకపోయినా.. విరాళాలు సేకరించేందుకు ఓ ఛారిటీ ఫుట్​బాల్​ మ్యాచ్​లో సందడి చేశాడు. బాలీవుడ్‌ నటులు అర్జున్‌కపూర్‌, సమిర్​ కొచ్చార్​, కొరియోగ్రాఫర్‌ కేసర్‌ గొన్‌సాల్వ్స్‌, టెన్నిస్‌ దిగ్గజం లియాండర్‌ పేస్‌తో కలిసి సాకర్​ ఆడాడు.

ఇవీ చూడండి...నెట్స్​లో ధోనీ ప్రాక్టీస్... రిటైర్మెంట్​ వార్తలకు తెరదించినట్లేనా..!

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details