టీమ్ఇండియా మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ రిటైర్మెంట్పై వస్తోన్న ఊహాగానాలపై స్పందించాడు ఆస్ట్రేలియా దిగ్గజం మాథ్యూ హెడెన్. వీడ్కోలు విషయమై అతడు త్వరలో ఒక నిర్ణయానికి వస్తాడని ఆశాభావం వ్యక్తం చేశాడు. గతేడాది జరిగిన ప్రపంచకప్ సెమీస్‌లో న్యూజిలాండ్‌పై ఓటమి తర్వాత నుంచి టీమ్ఇండియా మాజీ కెప్టెన్ ధోనీ క్రికెట్‌కు దూరంగా ఉంటున్నాడు. ఐపీఎల్‌తో రీఎంట్రీ ఇవ్వాలకున్నా కరోనా కారణంగా ఆ లీగ్ వాయిదా పడింది.
"నా మిత్రుడైన ధోనీ కెరీర్ గురించి మాట్లాడాలంటే నాకెంతో కష్టంగా ఉంటుంది. నా దృష్టిలో అతనొక ఛాంపియన్. ఆటగాళ్లు ఆట నుంచి ఎప్పుడు వైదొలగాలో వ్యక్తిగతంగా వారికి తెలుసు. కానీ కెరీర్ చివర్లో ఒత్తిడిని ఎవరూ కోరుకోరు. ధోనీ.. టీమ్ఇండియా విజయాన్ని సాధించడం కోసం తీసుకున్న గొప్ప నిర్ణయాల వలె త్వరలోనే ఓ సంచలన నిర్ణయం తీసుకుంటాడని ఆశిస్తున్నా".