తెలంగాణ

telangana

ETV Bharat / sports

'ఆరేళ్లలో ధోనీ కెప్టెన్సీలో చాలా మార్పులు' - ధోనీ సారథిగా ఎంతో అనుభవాన్ని నేర్చుకున్నాడు

కెప్టెన్సీ అందుకున్న తర్వాత ధోనీ విషయంలో చాలా మార్పులొచ్చాయని చెప్పాడు మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్. అతడిలో ప్రశాంతత అలవడిందని, బౌలర్లు తమను తాము తీర్చిదిద్దుకునేలా తయారుచేశాడని వెల్లడించాడు.

dhoni
ధోనీ

By

Published : Jun 28, 2020, 11:18 AM IST

Updated : Jun 28, 2020, 12:05 PM IST

టీమ్​ఇండియాకు మహేంద్ర సింగ్​ ధోనీ కెప్టెన్​గా ఉన్నప్పుడు అతడిలో ఎలాంటి మార్పులు వచ్చాయో వెల్లడించాడు మాజీ ఆల్​రౌండర్​ ఇర్ఫాన్​ పఠాన్​. 2007లో సారథ్య బాధ్యతలు అందుకున్నప్పుడు చాలా ఉత్సాహంగా ఉన్నాడని, 2013కు వచ్చేసరికి ప్రశాంతంగా ఆలోచించే స్వభావాన్ని అలవరుచుకున్నాడని తెలిపాడు. స్టార్​స్పోర్ట్స్​ నిర్వహించిన 'క్రికెట్ కనెక్టడ్​' కార్యక్రమంలో మాట్లాడిన పఠాన్.. మహీ గురించి పలు ఆసక్తికర విషయాలు చెప్పాడు.

"2007 టీ20 ప్రపంచకప్​, 2013 ఛాంపియన్​ ట్రోఫీ జరుగుతున్నప్పుడు ప్రతిమ్యాచ్​కు ముందు ఐదునిమిషాల జట్టు సభ్యులంతా భేటీ అయ్యేవాళ్లం. అయితే ఈ ఆరేళ్ల వ్యవధిలో ధోనీ, ఓ సారథిగా వ్యవహరించే విషయంలో చాలా మార్పొచ్చింది. 2007లో తొలిసారి అతడు బాధ్యతలు అందుకున్నప్పుడు వికెట్​కీపింగ్​ నుంచి బౌలింగ్​​ వరకు ప్రతిదీ తానే చూసుకునేవాడు. కానీ 2013 వచ్చేసరికి బౌలర్లకు క్లిష్టపరిస్థితులు ఎదురైనా సరే, ఎలా ఆడాలో వారే తెలుసుకునేలా తీర్చిదిద్దాడు. సారథిగా తప్పుకునే సమయానికి చాలా కూల్​గా, కంట్రోల్​గా ఉన్నాడు"

-ఇర్ఫాన్​ పఠాన్​, టీమ్​ఇండియా మాజీ ఆల్​రౌండర్​

కెప్టెన్​గా ఉన్న సమయంలో ధోనీ, స్పిన్నర్లపై నమ్మకం ఉంచేవాడని ఇర్పాన్ చెప్పాడు. వారికి మరిన్ని అవకాశాలిచ్చి ప్రోత్సాహించేవాడని అన్నాడు. ఇర్ఫాన్ పఠాన్.. ఈ ఏడాది ప్రారంభంలో క్రికెట్​కు రిటైర్మెంట్ ప్రకటించాడు.

ధోనీ విషయానికొస్తే గతేడాది జరిగిన ప్రపంచకప్​ సెమీస్​లో చివరగా కనిపించాడు. ఆ తర్వాత ఆటకు తాత్కాలిక విరామం ప్రకటించాడు. ఐపీఎల్​ 13వ సీజనలో పాల్గొని తిరిగి జట్టులో చోటు దక్కించుకోవాలనుకున్నాడు. కానీ కరోనా ప్రభావంతో ఈ టోర్నీ నిరవధిక వాయిదా పడింది. మహీ కెప్టెన్సీలోనే భారత జట్టు.. 2007 టీ20 ప్రపంచకప్, 2011 వన్డే ప్రపంచకప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ, 2010-2016 ఆసియాకప్​లు గెలుచుకుంది. టీమ్​ఇండియా చరిత్రలో అన్ని ఐసీసీ కప్పులు గెలుచుకున్న ఏకైక సారథి మహీనే కావడం విశేషం.

ఇది చూడండి : 'సీఎస్​కే డ్రెస్సింగ్​ రూమ్​లో ఏదో తెలియని ధైర్యం'

Last Updated : Jun 28, 2020, 12:05 PM IST

For All Latest Updates

ABOUT THE AUTHOR

...view details