భారత్ తరఫున గొప్ప ఫినిషర్‌గా పేరు తెచ్చుకున్నాడు మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీ. అతడు క్రీజులో ఉండి గెలిపించిన మ్యాచ్‌లు అనేకం. 2016 టీ20 ప్రపంచకప్‌లో ఆస్ట్రేలియాతో జరిగిన పోరు అందులో ఒకటి. కంగారూ జట్టు నిర్దేశించిన 161 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో 94 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది టీమిండియా. ఈ దశలో కోహ్లీతో కలిసిన ధోనీ.. మరో వికెట్ పడకుండా ఆడి భారత్‌కు విజయాన్ని అందించాడు. ఈ మ్యాచ్‌లో వీరిద్దరూ వేగంగా సింగిల్స్, డబుల్స్ తీస్తూ పరుగులు సాధించారు. ఆ సందర్భాన్ని సామాజిక మాధ్యమాల్లో గుర్తు చేసుకున్నాడు కెప్టెన్ కోహ్లీ.
"ఆ గేమ్‌ను ఎప్పటికీ మర్చిపోలేను. ఆరోజు ప్రత్యేకమైంది. పరుగుల విషయంలోఈ మనిషి ఒక పరీక్ష పెట్టాడు. అది ఫిట్‌నెస్ టెస్టులా అనిపించింది" -కోహ్లీ, టీమిండియా సారథి