తెలంగాణ

telangana

ETV Bharat / sports

ఫామ్‌హౌజ్‌లో రయ్ రయ్‌ మంటూ ధోనీ, జీవా - MS Dhoni takes daughter Ziva for a bike ride

టీమిండియా మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీ, కూతురు జీవాతో కలిసి తన ఫామ్​హౌస్​లో బైక్​ రైడ్​ చేశాడు. ఈ వీడియోను అతడి సతీమణి సాక్షి ఇన్​స్టాలో పోస్ట్​ చేయాగా అభిమానులు విపరీతంగా లైక్​లు, కామెంట్లు పెడుతున్నారు.

MS Dhoni takes daughter Ziva for a bike ride inside Ranchi farmhouse
ఫామ్‌హౌజ్‌లో రయ్ రయ్‌ మంటూ ధోనీ, జీవా

By

Published : Apr 27, 2020, 2:44 PM IST

లాక్‌డౌన్‌ వేళ ఇంట్లో ఉంటూనే టీమిండియా క్రికెటర్లు తమ అభిమానులను అలరిస్తున్నారు. కుటుంబసభ్యులతో సరదాగా గడుపుతూ ఆ సమయాన్ని ఆస్వాదిస్తున్నారు. టీమిండియా మాజీ సారథి మహేంద్రసింగ్‌ ధోనీ.. రాంచీలోని విలాసవంతమైన ఫామ్‌హౌజ్‌లో సేద తీరుతున్నాడు. కూతురు జీవాతో కలిసి రయ్‌ రయ్‌ మంటూ బైక్‌ రైడింగ్‌ చేశాడు. ధోనీ సతీమణి సాక్షి ఆ వీడియోలను ఇన్‌స్టా‌లో అభిమానులతో పంచుకుంది. ఈ వీడియోలకు తెగ లైకులు, కామెంట్లు పెడుతున్నారు నెటిజన్లు.

గతేడాది ఇంగ్లాండ్‌లో వన్డే ప్రపంచకప్‌ సెమీఫైనల్లో టీమిండియా.. న్యూజిలాండ్‌ చేతిలో ఓటమిపాలయ్యాక ధోనీ క్రికెట్‌కు దూరమయ్యాడు. అప్పటి నుంచీ మహీ అభిమానులు ఐపీఎల్‌ కోసం ఎదురు చూశారు. ఈ లీగ్​లో ఈసారి చెలరేగి మళ్లీ టీమిండియా జట్టులోకి వస్తాడని ఆశించారు. అయితే, కరోనా వైరస్‌ దెబ్బతో టోర్నీనే‌ వాయిదాపడింది. దీంతో చెన్నైలో ప్రాక్టీస్‌ మొదలెట్టిన ధోనీ.. తిరిగి రాంచీకి చేరుకున్నాడు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఐపీఎల్‌ 13వ సీజన్ నిర్వహణ‌పై అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇతడి భవితవ్యంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఇదీ చూడండి : బుమ్రా నంబర్.1 అవుతాడని ముందే చెప్పిన యువీ

ABOUT THE AUTHOR

...view details